Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Gayatri Tokachichu

Inspirational

4  

Gayatri Tokachichu

Inspirational

మనసుకు శాంతి.

మనసుకు శాంతి.

1 min
214


తేటగీతి మాలిక /


మనసు నందు మాలిన్యము పనికి రాదు

మదము హెచ్చిన చాలును మనిషి యెపుడు 

కనులు కానక నడుచును గతిని తప్పి

మదము లోభము మోహము మత్సరములు

కామ ముల గూడి 

యుండగా కనులు

తెఱచి

చూడ కున్నాడీ మానిసి చోద్య మకట!

ఆరు గుణములు మదిలోన నతిశయించి

పెరుగు చుండుటే జగతిలో పేదరికము.

సకల రోగంబులకు

మానసంబు నందు

దుర్గుణంబులు చేరుట దోష మనుచు

ధర్మ చింతన చేయుచు దాన మిడుచు

సత్య సంధత తోమెల్గి సద్గుణముల

సాధనంబుగ చేపట్టి సాగ వలయు.

క్రోధ వర్తను డైనట్టి కోప ధారి

మనసు యందున రక్తము మరిగి పోవ

తలను తిరిగెడి రోగము దాపు రించు.

మదిని చింతలన్ దొలఁగించు మార్గ మొకటి

పట్టి వెదుకంగ మనిషికి భవిత మిగులు.

మానసిక రోగ బాధలు మఱచి పోవ

మంచి పనులను చేపట్టి మసలు కొన్న

శాంతి కల్గగా తీరును సగము బెంగ.

పుస్తకంబులు చదువుచు మస్తకముకు

పనిని చెప్పిన చాలును బాగు పడును.

కవిత లల్లిన మనసుకు కలుగు శాంతి.

మొక్క పెంచుతూ హాయిని పొంద వచ్చు.

చెట్టు చేమలు మనసుకు జీవ మిడును.

ఇవ్విధంబుగా మానిసి యిచ్ఛకొలది

సంతసంబుగా బ్రతికిన చాలు మదికి

శాంతి కల్గగా మనిషికి సౌఖ్య మబ్బు.

---------------------


Rate this content
Log in