Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Swarnalatha yerraballa

Others

4.7  

Swarnalatha yerraballa

Others

మనసు

మనసు

1 min
661


మనసా ఓ మనసా

నీకు ప్రతి మనిషి బానిస అంటావు

నీ సంతోషమే తన సర్వస్వం అంటావు


                           "మనసా "

కనులకు కానరావు

కన్నీటిని తెలుపుతావు

గుండెకు చేరువవుతావు 

ప్రతి అనుభూతిని పంచుతావు

నీ స్థానం ఏదనిన ఏమని చెబుతావు

మేనులోని ప్రతి అణువు నీదే అంటావు

  

                           "మనసా "


మరుపన్నది మనిషి వరమంటావు

మరవనీక బాధపెడుతుంటావు

ప్రతి జీవి జీవం నీవంటావు

ఇంద్రయములను వరిస్తావు

తుదిశ్వాస వరకు రారాజై ఏలుతావు

మరుజన్మలోనూ నీడలా వెంటాడుతావు


                           "మనసా "


కోరికలు ఎన్నెన్నో రేపి కలవరపెడతావు

అవి తీర్చకున్న నీ లాలస లేదంటావు

నిన్ను లాలంచిన వారికి నరకమైస్తావు

కసిరి కాదన్నవారికి మోక్ష సింహాసనమిస్తావు

ఈ జీవన చదరంగం లో కర్మ ఫలం నాదేనంటావు

నిన్ను గెలవాలన్నా ఎన్నో జన్మల పుణ్యఫలం కావాలంటావు


                             "మనసా "


  



Rate this content
Log in