Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Midhun babu

Romance Inspirational

4  

Midhun babu

Romance Inspirational

మది తలుపులు...

మది తలుపులు...

1 min
231


మది తలపులతో ఈ వేళ

జ్ఞాపకాలు అలంకరించుకున్నాయేమో


అక్షరాలతో నిన్ను సంస్కరించి విస్మరిద్దామంటే

ఎన్ని భావాలు తలుపు తడుతున్నాయో


నీకేమితెలుసు నీ నుండి నేను నిష్క్రమించగలిగాను

కానీ నా నుండి నీవు నిష్క్రమించలేదే


అదిగో అలనాడు ఆకాశం దగ్గరగా నీవు

రాజసింహాసనం అధిరోహించినట్టు


ఒంటరిగా అటు తిరిగి కూర్చున్నావు చూడు

ఓ చందమామ నీ వీపును చూసి మురిసిపోయాను


చుక్కల్లో చంద్రుడు నా సక్కనోడు అని

దిగులు గుబులేసుకుని నేనుంటే


నీ ఎదుటికి ఎలా రాను

అయినా నేను బాగుండాలని కోరుకున్నావని

దిగులంతా మానేసి బాగుంటున్నాను


కానీ నడిజాముకు కానీ గుర్తుకు రావడం లేదు

ఇప్పుడు నీవు నా జట్టు కాదని


బురదలో ఉన్న తామరకు ఒక్కటే ధైర్యం

తాను బాగుంటానని తనకోసం సక్కన్నయ్య

వేచివుంటాడని


కానీ ఆ చంద్రయ్యకు చుట్టూ తారకలే నింగి నుండి నేలకు చూడాలని ఉన్నా


ఎన్ని అడ్డంకులు చిత్రంగా మురిపిస్తూ మరిపిస్తూ

ఈ చుక్కలన్నీ తన చెంతనే


ఇదిగో చంద్రయ్య నీకు నేను కనిపించను కానీ

నీవెప్పుడు నా తలపుల్లోనే ఉండిపోతావు లే...


... సిరి ✍️❤️


Rate this content
Log in

Similar telugu poem from Romance