మౌన నివేదన
మౌన నివేదన


అశ్రువుల ఆలింగనం తప్పనిసరి అయినపుడు
కొంగును కౌగిలించుకునే వున్నాను
శోకం శ్లోకమై ఒలికినపుడు గుండెను గట్టిగానే
బిగపట్టుకున్నానుస్రవించే గాయంసవరించే కాలం
కొలమానం లేని ఉపమానాలెన్ని భరించలేదు మనసు
సానుభూతి సంకెళ్ళైనపుడుసంఘర్షణకు సవరణ
తప్పనిసరౌతుందినిర్లక్ష్యపు మనసులు నిశ్శబ్దంగా వున్నా
మౌనంతోనే సమరంమనసు గాయానికిగెలుపోటములకు
ఆరాటపడనిభావాలనే నమ్ముకునిఅంతరంగంతో మాటలు
అనివార్యమైనపుడుఅక్షరాలను ఆవహించుకుంటూ
చెమ్మగిల్లిన చరిత్రలు చెప్పుకున్నాను
నిన్నలు కుదేలైనపుడుఙ్ఞాపకాలు బావురుమంటున్నా
నేటిలోకి జారిపోవడం తప్పసరివెంటరాని క్షణాలన్ని
రేపటి ఆశల రెక్కలు కట్టుకుంటాయి
ఉగ్గబట్టిన ఊహలు ఉసూరంటూ ఉనికిచాటుతుంటాయి
వేదనైనా యానం తప్పదువేకువ వెల్లి విరియక ఉంటుందా
సునాయాస ముంగిపుకైమౌననివేదన నాదయ్యిందిపుడు...!!,