మాదిలో పూసిన పూవ్వు
మాదిలో పూసిన పూవ్వు


నా మది ఒక వనం.
విర బూసిన పూల ధనం
ఆలోచనల ఆగమనం.
మరువని జ్ఞాపకాల విద్యాలయం.
తీరం దాటలేని సుదీర్ఘ ప్రయాణం.
ఊహలకు పదును పెట్టే సాదనం
ఎద లోతులను తూచే తూకం.
ఒక పుణ్య క్షేత్రం.
దారి దొరకాలి అని తలచే.ఆశయం.
ఎన్ని ఏండ్లు అయినా, మరెన్ని జన్మలున్నా
తల్లి గర్భంలో గూడే సురక్షితం.
అమ్మ నుండి పీల్చిన వాయువే నిజమయిన
ప్రాణం.
మనిషిని నిలబెట్టి బ్రతుకు దారి చూపిన వాడే
నిజమయిన చట్టం. బంధం. అనుభవం
ఆకర్షణతో,డబ్బుతో కులంతో వచ్చేది మాత్రం
శూన్యం.
కష్టంతో కూడుకున్నది ఏది అయినా అదే మనకు
ప్రతి ఫలం