కోమలి ప్రేమల దోసిలి
కోమలి ప్రేమల దోసిలి
కోమలి ప్రేమల దోసిలి
............................
ప్రేమదీపాన్ని
వెలిగించు కొమ్మంటూ
దోసిలిని ప్రమిదగా చెేసి
కోమలి నిలిచింది గుమ్మంలో
ఉత్సాహపు వెలుగుల్లో
మధురాశల రంగులతో
అంతరంగవలయాన్ని
ఆనందమయం గా
నిర్మించుకొమ్మంటూ
అయినా....
ఆహ్లాదాలు
అందాలూ
అలాంటివేవీ...
అసలు
ఈ
మనుషుల
మనస్సులను
స్పృశించటం లేదు
ప్రేమచిహ్నాలుకూడా
కోవిడ్ మాస్కుల్లా కన్పిస్తున్నాయ్
గుమ్మాల్లో
కొలువుదీరిన రంగవల్లుల్ని
చూస్తూంటే....,.
యమునితో
బయలుదేరిన
కరోనావైరసు సైన్యాల్లా కన్పిస్తున్నాయ్
వీధుల్లోకి రావటమంటే
యుద్ధంలోకి దూకినట్లుంది
ముచ్చట్లన్నీ మూసుకుపోయాయ్
ఇక్కట్లన్నీ
అల్లుకుపోయాయ్
కంటికి
కనిపించటంలేదు
సౌందర్యం!
వొంటికి
లభించటంలేదు
ఆరోగ్యం!
సర్వత్రా
సంయమనం
అనుసరణీయం!
ఆరోగ్యనియమాలను
పాటించటం శ్రేయం
అదే మన కర్తవ్యం
తక్షణం శిరోధార్యం!!