కాలం గాయం
కాలం గాయం


ఎందుకింత కఠినుడవైపోయావ్.....;
నేనెప్పుడూ నిన్ను ప్రేమిస్తూనే ఉన్నా....
నీకూ, నాకూ మధ్య ఎంతో పెద్ద అగాథం...!
కాలం మాయల ఫకీరు
సృష్టించిన వలలో నువు సులువుగా పడిపోయావ్..!
ఏనాడు కాదన్నాను నీ మాట...?
నాకంటూ ఉన్న ఒక్కటంటె ఒక్క అభిప్రాయానికైనా
నువ్వు విలువనివ్వనప్పుడు ..,
ఎన్నిసార్లని గుండెలోని నిప్పును నీరుగా మార్చుకోలేదు...?.....!
ఇంకా సహనంతో ఎలా ఓర్చుకోమంటావు....!
నాకు దూరంగా ఉండాలనే నీవు యత్నిస్తున్నప్పుడు,
అపనిందల ఇటుకలతో సౌధాన్ని పేర్చుతు
న్నప్పుడు,..,
అబద్ధాల మాల్ వేసి గట్టి పరుస్తున్నప్పుడు...
ఇంకేం చేయగలను...? మౌనశిలగా మారడం తప్ప...!
వేదనలు నాకేం కొత్తకాదు...
మూడేళ్ళ వయసులో నాన్నని కోల్పోయి..,
ఆరుగురు ఆడపిల్లలతో.
అమ్మ ఒంటరై నిలిచినప్పుడు..
గమనించకపోవచ్చు....
కానీ అమ్మ ఏకాకితనాన్ని
అంచనా వేసే కాలంలో
ఆవేదన స్వరూపమేంటో
తెలిసింది గా...!
ఇది ఇంకోరకం...
ఏదైతే ఏముందిలే ..!
సమస్యను సమిష్టిగా
దాటవలసిన సమయంలో
'నేను ప్రత్యేకం .'...'అని...,
తప్పుకుపోతే ఎట్లా?...