Raja Sekhar CH V

Drama

3  

Raja Sekhar CH V

Drama

జీవన రణరంగం

జీవన రణరంగం

1 min
417


ఎంతో కష్టమైనది అనూహ్యమైనది అందరి జీవన చదరంగం,

అంతే క్లిష్టమైనది సంఘర్షణ భరితమైనది జివిత రణరంగం,

అందులోనే స్వయంగా సృష్టించుకోవాలి సానంద తరంగం,

అప్పుడే పసిపాపడు వలె చెయ్యగలరు తారంగం తారంగం |౧|


వినిపించెను ఎప్పుడు ఒక కొత్త ప్రసంగం,

ప్రాధాన్యం పొందాలి హృదయ తురంగం,

పోటీతో పూర్తిగా ఉన్నది ప్రతి ఒక్క రంగం,

ఎప్పుడు ఆలకించలేం సారంగీ సారంగం |౨|


నిర్ణాయక స్థితి లో మేధస్సుకు చేసుకోవాలి ప్రయోగం సద్వినియోగం,

అంతఃకరణం ఆశాకిరణానికి కలుగకూడదు ధైర్య-భంగం ఆశాభంగం.

స్వీయ సన్మార్గ జీవితం పైన నిత్యం ఉండాలి అమితమైన అనురాగం ,

అనంతరం ఆనందంతో అంతరంగం అయ్యెను వినోదవిహారి విహంగం |౩|


Rate this content
Log in