జీవితంలో
జీవితంలో
బాధ్యతలో మునిగినా జీవితంలో గమ్యాలు చేరాల్సిందే
ఉన్నత శిఖరాలకు అదిరోహించాలి అంటే లక్ష్యాలు ఉండాల్సిందే
శిల్ప ఆకృతి మారుతుందా నైపుణ్యం లేకుంటే
అద్భుత కళా ఖండం సృష్టించాలంటే ప్రతిభతో రాణించాల్సిందే
చరిత పుటలు తిరగ వేస్తే తేలుతుంది భవిత రూపు
కాలంతో పాటు మనిషి జీవితంలో మారాల్సిందే
కావ్యం రాణించాలంటే కవన మాలికలో కలం కదలాలి
పద బంధంలో విజ్ఞత జ్ఞానం వైపు జత కట్టాల్సిందే....
సమాజం కోసం తపించే హృదయం ఈర్ష కాదు మానవత్వం వుండాలి
మార్పు ఏ ఒక్కరి వల్లరాదు అందరూ బాధ్యతతో మెలగాల్సింది