జీవితం
జీవితం
చేయి చేయి కలుపుకుంటు నడిచేదే జీవితం
ఇడుమలనే ఓర్చుకుంటు పడిలేస్తే జీవితం
సాగరంలొ సుడులెన్నో దాగివున్నా"చల్లా"
భవసాగరమందు పడవ ప్రయాణమే జీవితం
మనసులోన ఆలోచన కల్లోలమె ఎప్పుడూ
మంచి చెడులు కలహించే వివాదమే జీవితం
క్షణం క్షణం యమగండం సంసారపు ప్రయాణం
కత్తిమీద సాములాంటి ప్రమాదమే జీవితం
కోట్ల జీవరాసులన్ని మనతోనే గడిపినా
మనిషిగనువు బ్రతకాలను నినాదమే జీవితం