జీవితం...
జీవితం...
ఒక్కడిగా వచ్చి
ఒక్కడై పోయే జీవితాన.....
అరువు తెచ్చుకున్న
కర్మ బంధాలు,
అతికించుకున్న కొన్ని బంధాలు
అప్రమేయమై కొన్ని,
అవసరార్ధం కొన్ని,
ఒడ్డుకు చేర్చే జీవనదిలో
నడకలో నావలే అన్నీ.....
తీరం చేరేలోగా
తీపి జ్ఞాపకాలను పంచిన వాటికి
తనివి తీరా కృతజ్ఞతలు,
చెరిగిపోని చేదు గురుతులు పంచిన
వాటికి చేతులారా క్షమార్పణలు.....
గాయపడిన మీ గుండె భాధ
గ్రహించాలన్నా.....
మీరు పంచిన
మరపురాని మాధుర్యాన్ని
మన్నించాలన్నా.....
నా గుండె నిండా ప్రేమ
ఉండి తీరాలి కదా.....
అది మీరు నమ్మాలి కాదా...