Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

శ్రీలత "హృదయ స్పందన "

Romance Classics Inspirational

4  

శ్రీలత "హృదయ స్పందన "

Romance Classics Inspirational

హృదయ గులాబీ 🌹

హృదయ గులాబీ 🌹

1 min
344



అందమై‌న ప్రకృతి పరవశింపజేస్తుంటే

వీచే గాలి వేణు నాధమై వినిపిస్తుంటే..


లోకాన్ని వీక్షించే కనులు

అందమైన కలలను పరిచయం చేసి

నాలో ఒక లోకం సృష్టించేందుకు తపన పడే సమయం


అల్లరి బాల్యం అలసిపోయి నిద్రిస్తుంటే

చిలిపి ఊహాలు మేలుకుంటున్న క్షణం

ఆశలు ఆశయాలుగా

ఆనందాలు అభిరుచిగా

మది భావాలు కవిత్వాలుగా మారుతున్న యవ్వనం


తొలి వలపు మాధుర్యానికై

మనసు మదన పడుతున్న వేళ

ప్రేమోదయ సమయంలో

నీ చూపుల మృదు తుషారంతో

వికసించినదొక హృదయగులాబి

విరజిమ్మెను నీకై ఊహల గుబాలింపులు..


యవ్వన వేకువలో...

విప్పారుతున్న కలల పుష్పాలు

కన్నుల లోగిలిలో...

ఆకర్షణల ఆనందపు కాంతులు ప్రసరిస్తుంటే

ప్రణయ పరిమళాలు వెదజల్లుతూ

మదిని పరవశింప చేస్తున్నాయి..




Rate this content
Log in

Similar telugu poem from Romance