హృదమేమి
హృదమేమి

1 min

199
చెలునకేమి ఇవ్వగలను..పడగ-లేని మనసుతప్ప..!
హృదమేమి తెలుపగలను..వీడ-లేని సిగ్గుతప్ప..!
వ్రాసుకోను విషయమేమి..దొరికేనట ప్రేమలోన..
వాదమేమి చేయగలను..దాచ-లేని ఉడుకుతప్ప..!
ఆడుకోను చోటిచ్చిన..పుడమికెన్ని కృతజ్ఞతలొ..
గంధమేమి అలదగలను..మోయ-లేని ముద్దుతప్ప..!
మదినేలే దేవతయే..మాయమయ్యె కలలోలా..
లేఖలేమి వ్రాయగలను..పట్ట-లేని వలపుతప్ప..!
ఒక తప్పని వెతుకులాట..బహుమతిగా దేనికటా..
అడుగులేమి వేయగలను..చూడ-లేని పరుగుతప్ప..!
ఆశపడుతు మునిగితినే..పలురంగుల కడలిలోన..
చిత్రమేమి గీయగలను..విడిగ-లేని తెలుపుతప్ప..