Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Swarnalatha yerraballa

Drama Classics Children

4.8  

Swarnalatha yerraballa

Drama Classics Children

హనుమలో దాగిన మరో హనుమ

హనుమలో దాగిన మరో హనుమ

1 min
310


రామ రామ అని స్మరించిన

ఇదిగో వస్తున్నా అంటాడు హనుమ


సీత రాముల గాథను కీర్తించిన

ఈ జన్మకు ఇది చాలంటూ పరవశించి పోతాడమ్మా


రామబంటు చరిత ఏమని అడిగిన

రామ చరితకు మూలం అని చెప్తాను వినుమా


          "రామ రామ "


అసుర రావణుడు వైదేహిని దేహి అంటూ అపహరించిన

అల్లంత దూరన ఉన్న సీత కోసం రాముడు అశ్రు పర్యంతమాయె

చెంతకు చేరిన హనుమ స్నేహంతో రాముడిని ఊరడించి

చింత చేయకంటూ రామ మదిలో ధైర్యాన్ని నింపెనె


           "రామ రామ "


అతి సుందర అశోకవనంలో భూమిజ భోరున విలపిస్తున్న

ఆచటికి చేరేవారు లేరంటూ వానర సైన్యం సన్నగిల్లె

చింత ఎందుకంటూ జాంబవంతుడు మారుతి మహత్వాన్ని గుర్తు చేసి

చూడామణి చేతికిచ్చి ఛంగున జానకి జాడ కనిపెట్టమనె


         "రామ రామ "


ఆంజనేయడు ఆకాశమే అవధిగా అంతకంతకు పెరిగనా

అధైర్యం వెనుక దాగిన శక్తీతో మరో మారుతిని వెలికి తెచ్చె

చటుక్కున మహాగిరులను గిర్రున ఎగురుతూ దాటి

చిన్నగా అడ్డుకున్న లంకిణిని లక్ష బాధలు పెట్ట చుట్టముట్టె


          "రామ రామ "


అతిబలశాలి పవన తనయ పసిడి లంకను చేరిన

ఆ దేవికి చూడామణి ఇచ్చి ధైర్యాన్ని నింపె

చక్కటి లంకలో జాంబవంతుని మాటలు స్ఫురణకు తెచ్చుకొని

చుక్కలు చూపించి రావణుని చతికల పడజేసెనె


          "రామ రామ "



Rate this content
Log in

Similar telugu poem from Drama