హలో నేస్తమా
హలో నేస్తమా


ఎవరివో తెలియదు పరిచయం ఐయేంత వరకు
ఎక్కడ_వుంటావో తెలియదు నీవు చెపేంత వరకు
ఎలా_వుంటావో తెలియదు నిన్ను చేరేంత వరకు
ఎంతవరకు_నిలుస్తావో తెలియదు
నీ ప్రవర్తన తెలిసేంత వరకు
ప్రాణంగా నిలిచిన క్షణాన్న నా హృదయం
నీ_చెలిమిలో_ఊయలూగేను_నేనున్నంత_వరకు
రోజు ఈ చరవాణిలో నీ స్వరం వింటే చాలు
పెదవులకు ఓ పులకింత
చిరునవ్వుల కేళింత
మనసుకి తుళ్ళింత
వయసుకి హోళింత
హృదయలోగిలికి పరిమళింత
నీ ..నా... ఉనికికి ఆనవాలంత
r>
దూరంగా ఉన్న నీ చెలిమిని దగ్గర చేసే
నీ మాటల ఊసులు
దూరంగా ఉన్న నీ చెలిమిని దగ్గర చేసే
నీ భావాల అల్లికలు
దూరంగా ఉన్న నీ చెలిమిని దగ్గర చేసే
నీ రూపం చిత్రాలు
మన ఇరువురి స్నేహన్నీ మరింతగా
చేరువ చెయ్యాలి నేస్తం
కానీ ......
స్నేహమనే ముసుగులో
స్వార్ధం అనే తొడిమతో
మోసపూరిత మాటలతో
అవసరమనే రహదారిపై
నడిపించకు మన చెలిమిని
అది ఎప్పుడోకప్పుడు శాపంగా మారి నిన్ను కాటేస్తుంది నీవు వున్నంత వరకు