Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Thorlapati Raju(రాజ్)

Classics Fantasy Children

4.7  

Thorlapati Raju(రాజ్)

Classics Fantasy Children

హౌ స్వీట్❤️

హౌ స్వీట్❤️

1 min
381



......................

తోటకు పూలు అందం

పల్లె కు పైరు అందం

కుటుంబానికి పిల్లలు అందం

బాలలకి బడితోనే బంధం


అమ్మా నాన్నల దగ్గర హాయిగా గడపాల్సిన బాల్యం

తోటి మిత్రులతో తనివితీరా ఆడుకోవాల్సిన బాల్యం

స్వీయ ప్రగతికి దేశ భవితకు పునాది వేయాల్సిన బాల్యం

నేడు

మొబైల్ మాయా మహల్ లో అడుగుపెట్టి

అంతర్జాలపు అందమైన అగాధం లో కళ్ళు పెట్టి

అశ్లీలపు బొమ్మల బురద బుర్రకు పట్టి

పబ్జీ.. ఫ్రీ ఫైర్ లతో కాలాన్ని మంటల్లో నెట్టి

మల్లె వంటి తెల్లటి మనసుకి మకిలి అంటి

బాల్యం అంతా...అస్వాధన లేమి తో

అంతరించిపోతున్నది


ఓ వైపు ఇంకనూ వారి నివాసం

రైలు స్టేషన్లు..బస్సు స్టేషన్లు


బతుకు తెరువు..

ఇడ్లీ హోటళ్ళు..ఇంటింటి పాకీ పనులు


అందమైన ఆ పాలబుగ్గల పై

నలుపు రంగు అద్దింది ఎవరు?

దూది వంటి అరచేతిని 

దుక్కముక్కలా చేసింది ఎవరు?

చల్లటి మనసు లో మంటలు రేపింది ఎవరు?


కడు పేదరికమా..కటిక దరిద్రమా

ఎవరి పనుల్లో వారు బిజీగా ఉండే సమాజమా

లేక పిల్లల వయసే వారికి శాపమా

వారి బలహీనతే పెద్ద వాళ్ళ బలమా


చిరు చేపలు ఈదేందుకు ఎవరికి చెయ్యాలి ఊడిగం

చిరుత కూన ఆడేందుకు ఎవరికి కట్టాలి కప్పం

గువ్వ పిట్ట ఎగిరేందుకు ఆకాశానికి చెయ్యాలా చాకిరి

లేడిపిల్ల గంతులేసెందుకు నేలకు చెల్లించాలా చిల్లర


వీటికి లేని వెట్టిచాకిరి

పసిమొగ్గంటి పిల్లల కేల?

బాల్యమంటే కాదు బానిసత్వం

యెంత ధర చెల్లించినా 

కొన లేని మాన్యం

తిరిగి పొందలేని మాధుర్యం


      .....రాజ్....



Rate this content
Log in

Similar telugu poem from Classics