Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Thorlapati Raju(రాజ్)

Classics Fantasy Inspirational

4.7  

Thorlapati Raju(రాజ్)

Classics Fantasy Inspirational

HAPPY

HAPPY

1 min
422


నీ కోసం...

ఆకలి తీరినా... చిన్నప్పుడు

అమ్మ చనుబాలు పంటితో పట్టుకొనే ఉన్నా

ఓ హ్యాపీ! నీ కోసం

అమ్మని అడుగు కూడా వేయనీయకుండా

ఏడుస్తూనే ఉన్న

కావల్సింది కొనే వరకు నాన్నని విసిగిస్తూనే ఉన్న

క్లాస్ లు అవుతున్నా..వినకుండా

మిత్రులతో కబుర్లు చెబుతూనే ఉన్న


ఓ హ్యాపీ..నీకోసం

పుస్తకాలు చదివా..

పుల్లట్లు తిన్న

మిత్రులతో తిరిగా

మూవీస్ చూసా

ఆటలు ఆడా

పాటలు పాడా

వ్యాపారం చేశా

కాపురం చేశా

సొమ్ము సంపాదించ

సొంత ఇల్లు కట్టా

శృంగారం చేశా

సన్యాసం తీసుకున్న


ఓ హ్యాపీ...

నువ్వు మాయ లాడివే

నీకోసం..

యెన్నో చేశా..యెన్నో చేస్తున్నా

ఇంకా ఎన్నో చేద్దాం అనుకున్నా 

కానీ! కాలు కాలిన పిల్లి లా

నువ్వు ఒక్క చోట ఉండవు కదా నా ప్రాణానికి


అసల నువ్వే ఒక చోట ఉండటం లేదా

లేక..నా మనసే ఒక చోట ఆగటం లేదా

నీకోసం...సూర్యుని చుట్టూ తిరిగే భూమిలా

నీ చుట్టూ తిరుగుతూనే ఉంది..నా మది


ఓ హ్యాపీ!....మదిలో నే ఉన్న నిన్ను

మందిలో వెతుకున్నా చూడు...

నాది బుర్ర లేని పని!


         ... రాజ్...


        



Rate this content
Log in