Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Gayatri Tokachichu

Inspirational

4  

Gayatri Tokachichu

Inspirational

గురుకులం

గురుకులం

1 min
372



(బాల పంచపదులు)


వేదకాలము నాటి సాంప్రదాయము

పాదు కొల్పెనీ భారత దేశము

భుక్తి ముక్తికిదే సోపానము

దేవాలయము వంటి గురుకులము

సమాజహిత కేంద్రం విజయ.


గురుకులమన్నది యందరిది

భారతీ సతి నివాసమది

తమోగుణమును తొలగించునది

జ్ఞానజ్యోతిని వెలిగించునది

సంఘీభావము నేర్పునది విజయ.


భేదభావములు చూపరట

కాసులకొఱకు కాంచరట

త్యాగధనులకు నెలవట

నిత్యము జ్ఞానం వర్షించునట

దేశభవితకు మూలం విజయ


గురుకులమన్నది లేకుండిన

దేశభవితయే శూన్యమనిన

వేదసూక్తిని చదువుకొనిన

జాతి నిలుపును శాశ్వత ఘన

వారసత్వసంపదను విజయ.


పారమార్థికకు పట్టుగొమ్మలు

శాస్త్రశోధనా ప్రయోగశాలలు

సమసమాజ నిర్మాణ కేంద్రాలు

విజ్ఞాన విద్యా భాండాగారములు

జాతికెనలేని సంపత్తి విజయ.

****************


Rate this content
Log in