గెలుపు..
గెలుపు..
పొద్దున్నే చల్లగాలితో నిద్దురలేపుతావు.
మధ్యాహ్నానికల్లా మండుటెండను కాస్తావు మత్తు వదిలిస్తావు
సాయంకాలానికి కాసిన్ని చినుకులు చల్లిపోతావు
ఒక్కరోజులోనే మూడు ఋతువులు నీ గుప్పిట్లో..
మనిషికి వర్ణ భేదాలొద్దన్నావు
సప్తవర్ణాల ఇంద్రధనుస్సును సిగలో తురుముకున్నావు.
“నువ్వు రత్నగర్భవే
నీ అసలు కలల పంట ఓ నల్లని వజ్రం లోకానికి సహసపు వెలుగులను పంచావు.
మండేలా పేరు ఇప్పటికీ గుండెలు నిండేలా
మూడు నోబెల్ శాంతి పావురాలను ఎగిరే...
... సిరి ✍️❤️