Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

VENKATALAKSHMI N

Fantasy Inspirational Others

4.5  

VENKATALAKSHMI N

Fantasy Inspirational Others

ఎన్నో.. ఎన్నెన్నో...

ఎన్నో.. ఎన్నెన్నో...

1 min
279



కాగితం పొట్లం లో చుట్టిన ఈ బతుకులో

ఎన్ని సుడులో ఎన్నెన్ని సుడిగుండాలో

ఎన్ని రాతలో ఎన్నెన్ని వెతలో

ఎన్ని అనుభవాలో ఎన్నెన్ని అనుభూతులో

ఎన్ని శిక్షలో ఎన్నెన్ని పరీక్షలో 

ఎన్ని వింతలో ఎన్ని కొత్త పుంతలో

కురిసిన వెన్నెల లెన్నో

విరిసిన మల్లెలు ఎన్నో ఎన్నెన్నో

కమ్మిన మబ్బు లు ఎన్నో

ముసిరిన చీకట్లు ఎన్నో ఎన్నెన్నో

తడిసిన వర్షపు జల్లులు ఎన్నో

తడిమిన కన్నీటి కడగండ్లు ఎన్నో ఎన్నెన్నో

సమస్యల వలయాలు ఎన్నో

సతమతల రాశులు ఎన్నో ఎన్నెన్నో

దుఃఖ భావులు ఎన్నో ఎండమావులు ఎన్నో ఎన్నెన్నో

ఆనందాల మాలలు ఎన్నో

అనుబంధాల లతలు ఎన్నో ఎన్నెన్నో

అహంభావపు పడగలు ఎన్నో

అహంకారపు నీలినీడలు ఎన్నో ఎన్నెన్నో

ఆశల సౌధాలు ఎన్నో ఆశయ సాధనలు ఎన్నో ఎన్నెన్నో

గాడితప్పిన గతులు ఎన్నో గమనం లేని గమ్యాలు ఎన్నెన్నో

తీరం చేరే నా

మనసు మురిసేనా!


Rate this content
Log in

Similar telugu poem from Fantasy