ఎలప్రాయం
ఎలప్రాయం
ఎల ప్రాయం ఎరుగునా ఆ ఎదలోన వ్యూహం
ఎలనాగను కోరి చెలరేగదా ఈ వింత మోహం
ఏమిచెప్పాలి మదిని కూడ మరలించే ఘోషను
అమితుమి తేల్చాలిగా ముందరే ఆ యోషను
పొగడ పూల దండతో పొగిడి చాలా గుండెలో
మీగడ మిసిమి ముసిమిలతో వన్నెల వెండిలా
మెరిసే యవ్వనమా ఆ మెరుపుల పున్నమేగా
కురిసే వెన్నెల కులుకులతో తనువే ధన్యమేగా
ఎల ప్రాయం ఎరుగునా ఆ ఎదలోన వ్యూహం
ఎలనాగను కోరి చెలరేగదా ఈ వింత మోహం
తడిసి ముద్దారిన తహతహలకు తన్మయమే
వడిసి వలపునే పట్టాక ఒడలకే అనునయమే
కొత్త వింతలే కోరి చేరే&nbs
p;సమయం కోలాహలమే
చిత్తమంతను ఆ నెరవేరని కోరికల కలకలమే
ఎల ప్రాయం ఎరుగునా ఆ ఎదలోన వ్యూహం
ఎలనాగను కోరి చెలరేగదా ఈ వింత మోహం
పొటమిరించి పొంగారే కలికి ఆ కలికితనమే
మిటకరించి మిణుగురై మిగుల చిలిపితనమే
విరిసి మురిసినా అందానికి ఆ విరహమేలనో
తరిచి చూసినా తరిగిపోదుగా హాసితమేలనో
ఎల ప్రాయం ఎరుగునా ఆ ఎదలోన వ్యూహం
ఎలనాగను కోరి చెలరేగదా ఈ వింత మోహం
ఏమిచెప్పాలి మదినికూడ మరలించే ఘోషను
అమితుమి తేల్చాలిగా ముందరే ఆ యోషను