ఎడారి దాహర్తి
ఎడారి దాహర్తి


ఇంటి పేరు అనురాగం
ముద్దు పేరు మమకారం,
అరబ్ దేశమేధైనా
ఓ వేతన విదేశీ...
సౌదీ సౌదాల వెనకనున్న
నీ వెన్ను ధన్నుకు
నీ శ్రమకి దాసోహం..
ఓసౌదీ సౌఖ్య విధాత
నీ ఆర్తే ఎడారి దాహార్తి,
దుర్భర దైన్య దయనీయ
బానిసత్వ వేదన తొలగించి
ఘర్ ఆజా పర్ దేసి
తీరా దేశ్ బులాతీ హై!
నాటి నేటి
ఆర్థిక పరంగా లేని .
భారతరాజ్యాంగ
రిజర్వేషన్స్
కులాల కంపు విధానం
భారత భవితకు
అవరోధం
ఆర్థిక సంక్షోభమే
అదోగతికి అసలు కారణమై
జీవితపు పెనుగులాటలో
సకల జనుల సన్మతే
ప్రతిభకు పట్టం
తప్పు అని తెలిసే
తప్పని
తప్పటడుగులు
విదేశీ ప్రయాణ
ప్రయాసలు
నిలుపుకో,!
గంగా గోదారి తీర్థాలు
గాద్గధికంగా జాతరలో
తప్పి పోయిన
బిడ్డకోసం..గాలిస్తూ
భారతీయాత్మ
అరేబియా తీరం ..
షార్జా, మస్కట్, దుభై,
కువైట్,సౌదీ అరేబియా,
దేశాల వెంబడి
వెతుకులాటలో
మమేకమై ,..
నిరీక్షిస్తన్నట్లు.
నీ రాక కోసం
నిలువెల్లా కనులై
తల్లి బిడ్డను కోల్పోయిన
భాదను అంతరంగంలో
దాచుకొనే చింతిస్తూ..
వడి వడిగా
విడి వడిన
ఆర్థిక వ్యవస్థ
మూలాలను
సమూలంగావెలికి తీసి
అవాంతరాలను
అంతరాలను
ప్రక్షాళన గావించి
వాటిని అధిగమించి
స్థిరతే స్వావలంబిక
ప్రయత్న ఫలితమే
ఆపేక్షలతో కూడిన
భవిష్య భారత
దార్శనికత గా సాగిపో!
ఓదార్చే కన్నతల్లి లాంటి
దేశమాత తన ప్రయత్నంగా ఘోషిస్తూ..పిలుస్తోంది ..
మాతృహృదయ
మామకారపు
మన దేశ మాత
కలత పడిన
ఈ దేశాన్ని కాపాడ
మందిక తీరు తెన్నూ ,
నిత్య నిర్మల
గంగా యమునా
కావేరీ గోదారి కృష్ణమ్మ
పరవల్ల జలదితరంగాల
ఓయాసిస్ల వడిలో
కలుసుకో,
తల్లి భారతి
ఆవేదన తెలుసుకో..
ఈ మట్టిలో పుట్టి
ఈ మట్టి తో పెరిగి
భారతావని సేవలో తరించి పో,
భారతావని వడి లోనే బ్రతుకంతా
ఉండిపో !
కడకు ఈ మట్టి లోనే కలిసిపో..!!