Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gayatri Tokachichu

Inspirational

4  

Gayatri Tokachichu

Inspirational

ధరణి దీవెన

ధరణి దీవెన

1 min
204



******************************

చెట్టుకొట్టి పుట్టకొట్టి అడవి కాల్చి యవని కూల్చి

ఆకాశహర్మ్యాలు పెంచి పెంచి 'ఆశ 'వెనుక పరుగు తీసి

వీరంగం త్రొక్కుచున్న వెఱ్ఱిమనిషీ!


జంతుజాలము తరిగిపొతే, జీవమన్నది కరిగిపొతే

నిలువ నీడే కరువు మనకు తెలిసికొమ్ము నిజము తుదకు.


ఖనిజసంపద కొల్లగొట్టి పర్వతాలను పిండిచేసి

ధరణికి పెను ముప్పు తెచ్చి దానవత్వముతో నెగసి

విఱ్ఱవీగెడి వెఱ్ఱిమనిషీ!


ప్రకృతివనరులను పాడు చేయ పుడమి తల్లి గుండెకోయ

ప్రాణవాయువు దొరక దెపుడు తెలిసికొమ్ము నిజము నిపుడు.


నదులయందున కలుషితంబులు కలిపి వేసి కుదిపి వేసి

నాశనంబుకు నాంది పలికి నష్టపోయి నవ్వుచుండి

బుర్రలేని వెఱ్ఱిమనిషీ!


భావితరముకు భస్మరాశులు మిగిలియుండ భయము కలుగు 

జలము లేనిది జగతి నిలువదు తెలిసికొమ్ము నిజము తుదకు.


మొక్కనాటి నీరుపెట్టి వనము పెంచి ప్రేమ పంచి

పుడమి తల్లికి సేవచేసి పుణ్యనిధివై మేలు చేసి

మనసుకల్గిన మంచిమనిషీ!


సకలజీవులకుపకారము చేసి సాగుచుండగ

యూపిరి పీల్చిన ధరణి దీవెనలీయగ

కలుగునెపుడు మానవాళికి శుభం శుభం.//

***********************************



Rate this content
Log in

Similar telugu poem from Inspirational