Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dinakar Reddy

Abstract Classics

4  

Dinakar Reddy

Abstract Classics

దేవుడికి మొట్టికాయలు

దేవుడికి మొట్టికాయలు

1 min
174


అమ్మా

నువ్వు వెళ్ళిపోయావనుకున్నా

నిర్జీవమైన నీ దేహాన్ని చూసి

నా కన్నీటికి కూడా బాధేసింది


తింటున్నా తిరుగుతున్నా

పని చేసుకుంటున్నా

నిన్ను గుర్తు చేసుకోకుండా గడిపేస్తున్నా

నే నిన్ను మరచిపోయాననుకున్నా


నా పిచ్చిగానీ

నే నిన్ను మరచిపోలేదు

నువ్వు లేవన్న సంగతి మరచిపోయాను


అవును

నన్ను కనడానికి ప్రాణం పణంగా పెట్టిన నువ్వు

ఇలా కాలం తీరిందని 

నన్ను వదిలి ఎలా వెళ్లగలవ్


నాకు తెలుసు

మా పిల్లాడి దగ్గరి నుండి నన్ను దూరం చేస్తావా

హన్నా! దేవుడూ

ఎంత ధైర్యం నీకు అని

దేవుడు వాళ్ళ అమ్మకు చెప్పి

దేవుడికి మొట్టికాయలు వేయించి

(మరే!

దేవుడు కూడా వాళ్ళ అమ్మ ముందు చిన్న పిల్లాడేగా)

నా నీడలా నా ధైర్యంలా

నేను పొందే ఆశీర్వాదంలా

నాతోనే ఉన్నావ్ కదూ అమ్మా

ఉంటావ్ కదూ అమ్మా


అమ్మా నువ్వు తోడు ఉంటానంటే

నాకు భయం వేయదమ్మా

ఒక్కసారి చెప్పమ్మా



Rate this content
Log in

Similar telugu poem from Abstract