చూపులా అవి..
చూపులా అవి..
చూపులు కావవి వెంటాడి వేటాడేసే చురకత్తులు
కైపులు పెంచి కలలోను అవి వదలని చెలికత్తెలు
కూర్చుండనీయదు కూసింత సేపూ కుదురుగాను
మర్చుండనీయదు మనసూ నిలిచి ఎదురుగాను
కోరికెంతో కోరిన కోమలి పలికేనా తనే ముందుగ
చేరికెంతో సౌఖ్యం చేరాక ఆ తనువులకే విందుగ
చూపులు కావవి వెంటాడి వేటాడేసే చురకత్తులు
కైపులు పెంచి కలలోను అవి వదలని చెలికత్తెలు
నిన్న నేడు రేపు కూడ ఏవేవో కలిగించే మత్తులు
ఎన్నో వెలుగులే పంచే కళ్ళలోవెలిగించే ఒత్తులు
మూన్నాళ్ళ ముచ్చటా కాదే ముసిమిలో చెలిమి
బ్రతికినన్నాళ్ళు బాసటై నిలిచే తోడైన ఆ కలిమి
చూపులు కావవి వెంటాడి వేటాడేసే చురకత్తులు
కైపులు పెంచి కలలోను అవి వదలని చెలికత్తెలు
కూర్చుండనీయదు కూసింతసేపూ కుదురుగాను
మర్చుండనీయదు మనసూ నిలిచి ఎదురుగాను
కోరిక మంచుకొండలా కరిగి మడుగులాయేనులే
చేరిక చెంతకే ఎద తడబాటు తొలిగి పోయేనులే