Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

, చిరుగాలినై తాకాలని

, చిరుగాలినై తాకాలని

1 min
262



తన మనసు కౌగిలిలో మైమరిచిపోయా . 

తన మాటల కౌగిలిలో మురిసిపోయా 

తన నవ్వుల కౌగిలిలో పులకించిపోయా 

తన ఆలోచనల కౌగిలిలో తడిసిపోయా 

తన ప్రేమ కౌగిలిలో పరవశించిపోయా

చిరు గాలిలా చేరి నిను నిలువెల్లా తాకాలని 

చిలిపి చైత్రంలా వచ్చి నీ గుండె సడి వినాలని 

చిరునవ్వుతో నిను కవ్వించి నీతో ఆడాలని చిరకాలం 

నీతో నీతోనే ఉండాలని చిన్ని పువ్వై నాలో చేరి నన్నే మరిపించావు. 

చల్లగా నాలో కలిసి నాలో నేనే లేననిపించావు.

 నీ మాటలతో నన్ను ఆడించావు నీ పాటలతో నన్ను కవ్వించావు 

నా మనసుని నీ ప్రేమతో మైమరిపించావు. 

నా నీ మనసు ఊసులతో మురిపించావు. క్షణ క్షణం 

నీతో అధ్భుతంలా తలపించావు. 

ప్రతిక్షణం నువ్వే నా లోకం అయిపోయావు 

అనుక్షణం నీ తలపులలో తడిసిపోయేలా...

... సిరి ✍️❤️


Rate this content
Log in