చెలిమి
చెలిమి


నీహృదయంలో నేను వుంటేనే చెలిమంట,
నా తలపులు నిను తడిమితేనే చెలిమంట,
కనులలో నువు కనిపిస్తున్నా దాగుడుమూతలు తప్పవులే,
మధురమైన ఊసులతో నువ్వు నాలోనే వున్నావులే,
కవితలోన కనపడదు
కల్పనలే లేని హృదయఘోష,
అక్షరాలు ఎన్నున్నా చెలిమిలోతు చూపవులే,
మనసులోని గాయాలన్నీ చెలిమి చెంత మానునులే,
పూలనవ్వు మన పరిమళ చెలిమికి కానుకయ్యేలే,
మన గుండె గుండె జపిస్తున్నది చెలిమి వేదమంత్రమన్నది,
మధురభావాల మనచెలిమి తూచే మణులన్నవి యాడున్నవి,
మమతల చెలిమిసిరులకన్నా భాగ్యమన్నది లేదన్నది సత్యమిది,
ఎదలోని చెలిమిలోనే అమృతమన్నది దాగున్నది.