చెలిమి స్పర్మ
చెలిమి స్పర్మ


ఓ చినుకుతడిని ఆస్వాదించిన క్షణం వానలో తచ్చాడిన
బాల్యాల బంధం బడిగంట విన్నాక పరిగెట్టె మనసు
భుజాలపై చేతుల పరిచయం ప్రతి రోజూ కొత్తగానే
తరగతి మారినప్పుడల్లాజంటగానే ఒకే బల్ల మీద
వెనుకైనా వెతుక్కుని కూర్చోడం భలేగా తాయిలాలు
పంచుకోవడంఎంగిలి మరకల స్నేహ పరిళాలు హత్తుకోవడం
ఇంటిగంట కొట్టాక చెరో దిశలో వెళ్ళినా చివరదాకా చూసుకోవడం
చెదిరి పోని స్నేహానికి తియ్యని గుర్తులం మనంఆదివారమైనా
ఏదో నెపంతోచెలిమి స్పర్శను ఆస్వాదించడం అవసరమనిపించేది
నిన్నటిలానే ఉదయాల చిరునవ్వులునేటిలో కనులతో
మాట్లాడుకోవడంమామూలైనా మమకారం అల్లుకున్న
ఆక్షణాలన్నీఙ్ఙాపకాల్లో కుప్పలుగానే పోగేసుకున్నాయి
నీ గెలుపును ఆకాంక్షిస్తూ నేను నా విజయాన్ని ఆస్వాదిస్తు
నువ్వుకల్మషమే లేదప్పుడుకరిగింది కాలమే అయినా
స్మ్రతులు పదిలంగానేబాటలు వేరై తలోదారి....!!