బంధం
బంధం
పురిటి నొప్పుల తో
అమ్మ బంధాన్ని తెస్తుంది.
అనుబంధాలను పెంచుతుంది.
నిత్యం ఆనందం కోరుతుంది.
ఒక సంఘంలో సభ్యులుగా
నిలబెడుతుంది.
విద్యాబుద్ధులు నేర్పిస్తుంది
అజ్ఞానాన్ని మన నుండి
దూరం చేస్తుంది.
విజ్ఞాన శాస్త్రంలు నేర్చుకొమ్మంటుంది.
నీటి శాస్త్రం కొద్దిగా అయినా అలవరసు
కొమ్మంటుంది.
తోటి వారికి సాయం చేయమని
హెచ్చరిస్తుంది
ఉదాహరణలు చూపిస్తుంది.
వెలుతురే కాదు చీకటి వుంటుంది
భద్రం అని హెచ్చరికలు చేస్తుంది జ్ఞ్
సర్వ శాస్త్రాలు సారం అమ్మ గుండెలో
నిండి ఉంటుంది.
అమ్మ ప్రేమ రుచి చూడు.
జ్ఞాన దీపం మన చుట్టూ దర్శనము
ఇస్తుంది.
అందుకే అమ్మ ఆన్న ప్రతీ చోట
ఆనందం ఆరోగ్యం వెళ్లి విరుస్తుంది.
అమ్మను గారం చెయ్యాలి
అదృష్టం వరించేలా దీవెనలు పొందాలి.
