భార్యమనసే
భార్యమనసే


హృదయపు వీణియపై
మధురరాగ ప్రణయగీతి భార్యేలే,
కవ్విస్తూ కలహిస్తూ లాలిస్తూ ప్రేమించు భార్యమనసే చిలిపిదిలే.
అందమైన భావసుమముల
పరిమళ ఊసు భార్యేలే,
పరువాల దీపమై నిత్యం ప్రకాశిస్తూ
గుండెగుబుళ్ళు తీర్చేది భార్యేలే,
అనుబంధపు ఊయలపై
మరువలేని మురిపాలవిందుతో అలరించే నిత్యచెలిమి భార్యేలే
శ్రుతిమించని అలకలతో
రాజీపడేటి కోరికలతో
మనసుకు మనసయ్యేది భార్యేలే.
అందుకే అందుకో శ్రీమతి
ప్రేమాభినందనలు.
పిల్లల ఆలనాపాలనతో
పెద్దల సంరక్షణా భాధ్యత
తో
వంశకీర్తి పెంచేది భార్యేలే,
తన తపనతో
భవిష్యత్తు చీకట్లు తొలగించు
వెలుగుల భాగ్యరేఖ భార్యేలే,
భాషలేని పదముల మదిమెరుపు భార్యేలే,
గుండెలోని భారాలు దించేటి ధైర్య'లక్ష్మీ'
సంతాన సౌభాగ్య సిరులతో
వంశవృద్ధి చేయు సంతోష'లక్ష్మీ'
ధనధాన్య కలిమికి
మమతల శోభ కలిగించు
అనురాగ'లక్ష్మీ'
అష్టలక్ష్మీ ల మనోరూపమైన హృదయ'లక్ష్మీ' భార్యేలే,
ప్రశంసలతోనే కాదూ
ప్రాణానికి ప్రాణంగా చేసుకుంటూ
తన ప్రాణంలో మనముంటేనే
మాసిపోని దరహాసపు
సత్య కథగా మిగిలేములే.