బాల్యమేగ
బాల్యమేగ
1 min
4
ఎవరికైన అందమైన..లోకమంటె బాల్యమేగ..!
అమ్మప్రేమ లోగిలిలో..దీపమంటె బాల్యమేగ..!
వీరివీరి గుమ్మడిపండు..వీరిపేరేమిటండి..
మరువతగని అనుభవాల..కావ్యమంటె బాల్యమేగ..!
ఆ బొమ్మల పెళ్లిళ్ళు..ఆ తొక్కుడు బిళ్ళాటలు..
చీకుచింత లేని మనసు..చిత్రమంటె బాల్యమేగ..!
రాములోరి గుడిలో వడపప్పూ పానకాలు..
ప్రసాదాల కరువులేని..పర్వమంటె బాల్యమేగ..!
బడిబెత్తం తప్పించుకు..చేలవెంట ఏం పరుగులొ..
బ్రతుకుబాట గొడవెరుగని..భాగ్యమంటె బాల్యమేగ..!
