అనుకోను
అనుకోను
అవునన్నా కాదన్నా..ఒకటేనని అనుకోను..!
నీవుకాని వారెవరో..ఉన్నారని అనుకోను..!
కణకణమున నీవున్నా..చూడలేని తనమేమి..
చైతన్యము వెలకట్టగ..కుదిరేనని అనుకోను..!
పనిచేసే ముచ్చటయే..పెంచేనా నిపుణతను..
బద్ధకాన్ని ప్రేమిస్తే..మనుషులమని అనుకోను..!
ఎవరికేమి నేర్పాలట..అనుభవాలె గురువులోయ్..
మనశ్శాంతి ప్రసాదమది..ఈ ధనమని అనుకోను..!
బొగ్గున దాగిన వజ్రం..దానికదే వెలగదోయ్..
ప్రతిభకు పదునే పెట్టక..పెరిగేనని అనుకోను..!
ఆకులు రాల్చుకు మోడే..వసంతాన్ని పిలిచేను..
సహనం పట్టక ఫలములు..అందేనని అనుకోను..!

