అంతరంగమే
అంతరంగమే


ఏమిటో ఈ కలికాలంలో
మన కోరికలే శత్రువులుగా మారే
ప్రేమించేది నిత్య సంఘర్షణగా
ముళ్ళ బాటల్లో ప్రయాణాన్ని ముగించే...
అంతరంగమే నిత్య అగ్నిహోత్రంగా
సంఘములోని హెచ్చుతగ్గులే బాధలుగా
అణు యుద్ధము కన్నా ఎక్కువై
ఆలోచనలే ఆయుధమై కదులుతున్నాయి..
సప్త వర్ణాలు రంగులు మారుస్తూ
సత్యాన్ని భ్రమింప చేస్తూ
స్వచ్ఛమైన మనసుకు ముసుగులు కప్పి
ప్రపంచ నాటకంలో పాత్రల్లా
నటిస్తున్నారు..
p>
రక్తపు చుక్కల స్నానముతో
మరణపు శయ్యపై పోరాటాలు చేస్తూ
బతకడమే నిత్య పోరాటంగా
జీవితమంతా సమరం లాగా సాగుతుంది..
కొత్త వెలుగును తట్టుకోలేక
చీకటి పురాణాలను అనుసరిస్తూ
గుండె నిండా గాయాలను ఏర్పరుస్తూ
బడి గంటల విజ్ఞానం నింప లేక పోతున్నాం...
ఎండమావులనే నిత్యం తలుచుకుంటూ
అక్షరాల చెట్లను పెంచలేక
పచ్చని పాఠాలను నేర్చుకోలేక
ఎవడి పైనో నెపం నెట్టుతూ సాగుతున్నాం..