Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Gayatri Tokachichu

Inspirational

4  

Gayatri Tokachichu

Inspirational

అన్నదాత

అన్నదాత

1 min
282



-----------------------------

అన్నదాతయే ధరణిలో మిన్న యనుచు

సైరికునికి వందనబిడి సకల జనులు

గౌరవించగ వెలుగును భారతంబు.

విత్తు జల్లిన దాదిగా వేయి కనుల

జాగు రూకత తో పెంచి సాగు చేసి

మెతుకు పండించి దేశపు మేలు గాంచి

ధరిణి యందున రైతులు ధన్యులగుచు

నిల్చి యుందురు కర్షక నిష్ఠ తోడ.

వెన్నెముకలౌచు దేశపు పెన్నిధి వలె

సిరులు పండించి నిత్యము వరలు చుంద్రు.

కరువు కాటకంబుల తోడ కాటు వేయు

కాల మెంతయో భయమును కల్గ చేయ

కలత నొందక రైతులు వెలితి వీడి

సాగు చుందురు నిష్ఠతో జగతి కొఱకు.

బీదరికముకు వెఱవక బీళ్ళ యందు 

మెతుకు పండించి ప్రజలకు మేలొనర్చి

బ్రతుకు చుండెడి రైతులు భార మనక

ధరణి మాతను నమ్ముచు తరలు చుంద్రు.

రైతు లెల్లరు దేశపు రాజులనుచు

మ్రొక్కు చుండగ జనులిల పొంగి పోవు

అన్న దాతకు నేనిత్తు హారతులను.

----------------------------



Rate this content
Log in