Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Praveena Monangi

Inspirational

3  

Praveena Monangi

Inspirational

అంగీకారం

అంగీకారం

1 min
147


మనసులు ముడి పడిన జంటల పెళ్ళికి 

పెద్దల అంగీకారం కావాలి

పెద్దలు కుదిర్చిన పెళ్లికి 

వధూవరుల అంగీకారం కావాలి.


బిడ్డను ఈ లోకంలోకి తీసుకు రావడానికి 

తల్లి అంగీకారం కావాలి

రేపు ఆ తల్లిని చూచుటకు ఆ బిడ్డకు 

వాడి భార్య అంగీకారం కావాలి


టీనేజి పిల్లలకు మొబైల్ ఫోన్ కొనడానికి 

తల్లిదండ్రులు అంగీకారం కావాలి

వాళ్ల ఫోన్ చూడటానికి తల్లిదండ్రులకి 

ఆ పిల్లల అంగీకారం కావాలి.


చివరికి ఆ దేవున్ని దర్శించుకోవడానికి 

కూడా పూజారి అంగీకారం కావాలి

అంగీకారం లేకుండా చేసే ఏ పని అయినా  

ఈ జగత్తులో విపత్తు సృష్టిస్తుంది.


Rate this content
Log in

Similar telugu poem from Inspirational