అందాల ప్రేమ
అందాల ప్రేమ
నా అందాల భామవు నీవే,
అపురూప ప్రేమవు నీవే,
నీ మనసు వర్ణించ మధురభావన
ఏ కావ్యమందు లేదే.
తనువు ఆణువణువూ
ఆనందం నింపిన
నెరజాణవు నీవే,
నా శ్వాసలోనూ
నీతలపే దాగినదే,
మోహముకాని మమతతో
పెనవేసిన అనుబందానివే,
ప్రేమదైవపు ప్రతినిధిగా
ననుచేరావే,
కనులు మలగాక చూస్తున్న
నీ ప్రేమలో ఆరాధనే కనిపిస్తున్నదే,
అందుకో ప్రేమదేవత
నా ప్రేమరాగ మాలిక.
పరవశించు మదికి
అనంత భావరాగ సుధవునీవే,
కనురెప్పల వాకిట్లో నిలిచిన
నీ చిలిపిచూపులు
కలలోనైనా మరువలేనే,
నా హృదయాలాపనే
అనురాగం అభిమానం చాటేటి ప్రేమపేరంటమే,
మనసులు పెనవేసిన
ఆనందపు ఆకారముగా అవనిలో మనమే నిలిచిపోదామే.