అమ్మరా
అమ్మరా
కనీ పెంచే దేవత అమ్మరా,
కనిపించే దేవతామూర్తి అమ్మరా,
అమ్మను మించిన దైవం సృష్టిలో లేదురా,
అమ్మ ప్రేమలోతుకు అనంతమే సరిపోదురా.
లాలిపాటలో నీకు లోకం చూపించునురా,
నాదీ అనే స్వార్ధం వీడి మమతను పంచునురా,
గోరుముద్దల నీతి కథలతో నీ లక్ష్యం చెప్పునురా,
కాలపరీక్షలు ఏవైనా
తన జీవితాన్ని నీకె అంకితం చేయునురా,
సదా రక్షగ నిలిచి వెలుగుదీపమై దారిని చూపునురా,
కోటిదీపరాసులకన్నా అమ్మ అంతరంగం ఎంతో గొప్పదిరా,
తన ఆశలన్నీ ఆవిరైతే ఆయువే వద్దనురా.
అమ్మకనే మధురస్వప్నం కంటినీరులేని నీ రూపమేరా
మమకారపు నీ చూపులో ఆమె స్వర్గాన్నే దర్శించునురా,
తన తీయని తలపుల్ని తూచగల్గు ధనమేదిరా,
పరిమళించు ప్రేమలతో కన్నతల్లి ఋణం తీర్చాలిరా,
గుండెగుడిలో ఆ దేవుడైనా అమ్మనే పూజించునురా,
అమ్మా నీకు వందనం,
హాయిగొల్పు నీ నవ్వుకు పాదాభివందనం.
