అమ్మే ఒక అపురూపము
అమ్మే ఒక అపురూపము
అమ్మే ఒక అపురూపము,
త్యాగాల కోవెలలో
అమ్మే దేవుని ప్రతిరూపము.
అనురాగపు రాగంలో
అమ్మే ఆకాశము,
వాడిపోని మమతల సిరులతో ఎదలో ఒదిగిపోవు నిత్యము,
కంటిపాప హృదిలో పదిలపరచు అనుబంధము,
రెప్పమాటు కలలన్నీ చేయును కుటుంబానికి అంకితము,
ప్రేమకాంతుల అవనిలో
అమ్మే ఉషోదయము,
అమ్మకు చేద్దాము నిత్యం పాదాభివందనము.
మధురభావాల
అమ్మతనము వర్ణించ
సరితూగునా అక్షరము,
మదిని తడిమే అమ్మ మాటకు కూర్చగలనా
సప్తస్వర రాగము,
విచ్చుకున్న పరిమళ పూలపలకరింపు లోనూ
చూడాలి అమ్మను మనము,
గుండెలో నిండిన అమ్మరూపానికి
బ్రతుకునే చేయాలి మనం అంకితము.
మానవత్వన్ని మరచి
బ్రతుకునిచ్చిన
అమ్మను వేదిస్తే
ఎన్ని జన్మలెత్తినా తీరదు పాపఫలము,
అమ్మ మనసు దిగుళ్లను తుడిచేయడమే ముక్కోటిదేవుళ్ళ ఆరాధనా ఫలము,
అమ్మ చిరునవ్వే
కోటి వెలుగులదీపము,
అమ్మకు అమ్మగా జన్మించి తీర్చుకుందాము అమ్మ ఋణం
