అమ్మ
అమ్మ
1 min
3
అజ్ఞానపు చీకటినే..తొలగించును అమ్మ..!
తనతియ్యని మమతలనే..త్రావించును అమ్మ..!
అమ్మ రుణం తీర్చుకునే..భాగ్యమేది అసలు..
సర్వస్వం బిడ్డకొరకు..అర్పించును అమ్మ..!
అమ్మా అని పిలవగానె..బాహువులే చాచు..
కలనైనా బిడ్డసుఖం..కాంక్షించును అమ్మ..!
ప్రేమపూల వనమంటే..అమ్మమనసు నిజము..
పరిమళించు వెన్నెలలే..కురిపించును అమ్మ..!
తన ఉనికిని కోల్పోయే..హరివిల్లే తాను..
అక్షరాల మౌననిధిగ..జీవించును అమ్మ..!
గోరుముద్దలను పెడుతూ..జాబిలినే దించు..
బ్రతుకుతీరు బహుచక్కగ..నేర్పించును అమ్మ.
