అమ్మ
అమ్మ
దేవుడు దయ ఉంటే!
మంచితనం మన వెంట ఉంటే!
అమ్మ పంచలేని ప్రేమను కూడా భాగస్వామి పంచగలడనీ,
ఆడదాని జీవితాన్ని ఆ మంగళసూత్రంతో
ముడి వేస్తాడు,దేవుడు.
అమ్మ
మాటల్లో చెప్పలేని ప్రేమను చేతల్లో చెబుతుంది.
నీకు ఊహ తెలియక ముందు నువ్వే ప్రపంచమనీ తలచి,
నిన్ను సంరక్షిస్తూ, నీ వెంట ఉంటుంది.
తర్వాత తాను చూడని ప్రపంచాన్ని,
నువ్వు చూసి తనతో చెబుతుంటే!
నా బిడ్డ ఎంత పెద్దవాడయ్యాడో! అని నవ్వుకుంటుంది.
ఆడపిల్లకు ఆ అవకాశం లేదు.
పెళ్ళితో మా నుండి దూరమై,
ఆడ ఉండే పిల్లే కదా! అంటారు.
ఒక్కొక్కసారి ఇబ్బదులు వచ్చినా!
ఆసరాగా అన్ని సమయాల్లో మేమే అండగా ఉండాలనీ, అల్లుడుతో ఎంత దూరమైనా వెళ్ళిపోతారంటారు.
వాళ్ళకు పెద్దరికం ఇచ్చినా!ఇవ్వలేదనే చెబుతారు.
వాళ్ళకంటే పెద్దవాళ్ళ ముందు
వాళ్ళు పిల్లలకు పెళ్ళి చేసి పంపించటానికి,
మేం ఎంత కష్టపడ్డామో? అంటారు.
ఏంటో ఈ జీవితం అని నిరాశ పడదామంటే!
మాకు నువ్వు కావాలమ్మా! అని పిల్లలతో పలికిస్తాడు.
నిజానికి తల్లే! ఆడపిల్లకు
అన్ని వేళలా ఆత్మీయత పంచగలదు.
ఇది ఎంతమంది గ్రహించగలుగుతున్నారు.

