అలూమగలు
అలూమగలు


జీవితానికి అర్థం పరమార్థం
మనం నడిచే జీవనవిధానం
సంసారం మహాసాగరమే కావచ్చు
దాన్ని ఓర్పుగా,నేర్పుగా మలచుకుంటే...
జీవితం నందనవనమౌతుంది
ఒకరినొకరు అర్థం చేసుకొని
మసలుకుంటే జీవితనావ
సజావుగా సాగుతుంది
అలనాటి సాంప్రదాయాలు
ఆచరణీయమేకదా....
చిగురించిన ఆశలతో
కొత్తగా జీవితంలో
అడుగిడే నూతన దంపతులు
ఒకరినొకరు అర్థం చేసుకొని
జీవితాన్ని సక్రమంగా
తీర్చిదిద్దుకుంటే ...
అటు అమ్మానాన్నలు
ఇటు అత్తామామలు
దిగులు చెందాల్సిన
బాదుంటుందా....
ఒకరికి కష్టమొస్తే
మరొకరు ఓదార్పు
భార్యాభర్తలు వారిలో
వారుగాఒకరు ఎప్పటికీ..