Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kadambari Srinivasarao

Inspirational

4.5  

Kadambari Srinivasarao

Inspirational

ఐక్యతా రాగాలు

ఐక్యతా రాగాలు

1 min
263


చేతి వేళ్ళు ఐదూ కలిసిఉంటేనే కదా చేతికి పట్టుదొరికేది

ఏ ఒక్క వేలితో పట్టు సాధించలేనట్లే

విడిపోయిన కుటుంబ వేళ్ళన్నీ

తమ ఉనికిని కోల్పోవూ!


బంధాల రేకులన్నీ కలిసిఉంటేనే కదా

ఇంటి కలువ నిత్య వికశితమై

చూపరులను సైతం ఆకర్షిస్తూ

 ఉనికికి ఆధారభూతమయ్యేది


మానవ తంత్రులు కలిసిన కుటుంబ వీణ

ఐక్యతా రాగాలు సరిగ్గా పలికిస్తే

స్వర లాలిత్యంతో జగతి

సుఖమయంగా సాగదా!


కుటుంబ నావికులందరూ

కలిసికట్టుగా ప్రయత్నిస్తేనే కదా!

జీవన సంద్రంలో సంభవించే

ఆటుపోట్లను తట్టుకుని

నౌక సురక్షితఒడ్డుకు చేరేది


కలిసుంటే నిలబడతాం!

విడిపోతే పడిపోతాం!



Rate this content
Log in

Similar telugu poem from Inspirational