అదృష్టం
అదృష్టం
కలిసొచ్చే కాలానికి..
ముందు కలిసుండాలి కదా?
నా దగ్గర టైం ఉంటేనా
టైమ్ అందరి దగ్గరా ఉంది
నువ్వు నిద్దర లేవాలి కదా..
ఇంటర్వ్యూకి పిలవాలే గానీ
ఫస్ట్ నువ్వు ప్రిపేర్ అవ్వాలిగా సారూ
నోటిఫికేషన్ వేస్తే చాలు
ముందు రివిజన్ చెయ్యి బ్రదర్
అందరి కాడా అదృష్టం ఉంటదా
ఏమో సెప్పలేం
కానీ కష్టపడడం అయితే నీ చేతుల్లోనే ఉంది కదా
ఇంకెందుకు వాళ్ళ మింద
వీళ్ళ మింద చెప్పడం
నీ ప్రయత్నం మనస్ఫూర్తిగా చెయ్యి
పనికొచ్చే పనులు వెతుక్కో
బద్ధకం దూరంగా పెట్టుకో
తర్వాత రిజల్ట్ సంగతి చూద్దాం
ముందైతే నువ్వు పని చెయ్యి