,, ఆనందం లోకం
,, ఆనందం లోకం
అనురాగమే ఆనందలోకం,
ఆరాధనే మణిదీపం,
ప్రేమే జీవనరాగం,
కలలేలేని సత్యంలో పెనవేసిన అనుబంధం సుందరం సుమధురం.
పరవశించు బీడు ఆనందమే వర్షం,
అడియాశల గుండెకు ఆత్మీయతే జీవనదీపం,
చెమటతో సృష్టించిన స్వర్గమే
ఆనంద నందనవనం,
కలసిన మనసుల
వలపు సరాగమే
సంతోష సిరుల లోకం.,
అందానికి ఆనందమే ప్రాణం,
మురిపాల చిగురులకు చిరునవ్వులే
సుందరం సుమనోహరం.
వసంతం దరిచేరితే
పరవశించు విరిహృదయం,
చిగురువలపు తుళ్ళింతే
మనసైన మదిని మీటితే ప్రణయం,
విరబూసిన ఆశలే స్వరజతులైతే
ప్రియభావాలమది మురుయు నిత్యం,
అల్లుకున్న అందాలబంధాలే
బ్రతుకుబాటకు ఆనందభాష్యం.