STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

ఆమె ఆధారాలు...

ఆమె ఆధారాలు...

1 min
377



మొగ్గ విచ్చితే పువ్వు

ముగ్ధ పెదవి విచ్చితే నవ్వు

నాట్యం చేస్తూనే వుంటుంది లాస్యం

అనవరతం ఆమె అధరాలపై


కనులు మాట్లాడతాయంటే

కాదనరెవ్వరూ

కదలకనే మౌనంగా

కధలు చెబుతాయి అధరాలు !


పెదవులు బిగించితే

కలికికి కోపమొచ్చిందని.....

వేగంగా మూలలకు పరుగెట్టితే

వెక్కిరింత అని ....

సున్నా చుట్టితే

ముద్దొస్తున్నావని....

పంట నొక్కితే

వెంటనే ఆహ్వానం శృంగారానికని....

అర్ధం చేసుకోరూ 

అంగన అంతరంగాన్ని 

అధరాలు చెబుతుంటే !


విధాత ఎంతగా శ్రమించాడో

యోషిత అధర సృజనకై !

పనసతొనల వొలిచి 

పట్టుతేనెలొ నాన్చి

పాటల రంగునద్ది 

పంపాడు ఇలలోకి

అందుకేనేమో

అధరపానమంటే అంత పిచ్చి!

కనకం కన్నా

కాసులకన్నా

కీర్తీకన్నా

కిరీటం కన్నా

పెదవి రుచే మిన్న అని

పరుగులెడతారు పురుషపుంగవులు !


భవనానికి పిల్లర్లులా

భవ శృంగారానికి పెదవులు

తొలిమెట్టు మలిమెట్టు

అధర రసాస్వాదన చాలదా 

మదన పోరాటమేలా?


అసలే లేత ఎరుపు

ఆపైన రుధిర రంగు నద్దనేలా 

రక్తం త్రాగే పిశాచిలా

సహజత్వానికి స్వస్తి చెప్పకండి


 ... సిరి ✍️


Rate this content
Log in

Similar telugu poem from Romance