Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

VENKATALAKSHMI N

Fantasy Inspirational Others

4  

VENKATALAKSHMI N

Fantasy Inspirational Others

ఆధునిక దేశం(prompt 6)

ఆధునిక దేశం(prompt 6)

1 min
297


ఓ మనిషి!ఎటు నీ గమనం?

ప్రశ్నార్థకంగా మారుతోంది నీ పయనం?

నైతిక విలువలు మరచి

ఆధునిక ప్రపంచ ఉధృత ప్రవాహం లో

పరుగులాపక పయనిస్తున్న ఓ మనిషి

ఓసారి వెనుదిరిగి గమనించు!

వికృతంగా మారిన ప్రకృతి

భీకర జ్వాలలో రగులుతున్న పర్యావరణం

అంపశయ్యపై పరుండి అల్లాడుతుంటే

ప్రగతి రథ చక్రాలను పట్టుకుని

వేలాడుతున్న ఓ మనిషి

ఓసారి వెనుదిరిగి గమనించు!

అహం ఊడలకు వేలాడుతూ

స్వార్థ నదిలో మునక లేస్తూ

విపరీత పోకడలకు ఆజ్యం పోస్తూ

మానవత్వం మరచి దానవత్వం రగిల్చి

భవిష్యత్ బాటలను బీటవారుస్తున్న

ఓ మనిషి ఓసారి వెనుదిరిగి గమనించు!

సాంప్రదాయాలు గాలికొదిలి

సంస్కృతులకు నీళ్ళొదిలి

రాగద్వేషాల కుంపటిలో

మన అన్నది మరచిన ఓ మనిషి

ఓసారి వెనుదిరిగి గమనించు!

ఎటు వైపు సాగుతుందో నీ గమనం

గతి తప్పి శృతి మించి

గమ్యం మరచిన ఓ మనిషి

ఆలోచించి అడుగేస్తే

నీ గమనం అవుతుంది సుగమం


Rate this content
Log in