Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Changalvala Kameswari

Drama

2  

Changalvala Kameswari

Drama

కలాకారులే!

కలాకారులే!

3 mins
189


ఏందిరా ! ఏమైంది! ఏంటీ జొరం ! ఇంత జొరంలో ప్రయాణమంటావేంటి మావా? భయం నిండిన గొంతుతో మొగుడ్ని అడిగింది లచ్చి


అవన్నీ నీకెందుకే! అర్జెంటుగా బట్టలు సర్దు మనం ఈ ఊరు విడిచి వెళ్లిపోదాము.

ఈ ఊల్లో ఉండలేము.షాప్ ఈ ఇల్లుకూడా అమ్మేద్దాము "అనంటున్న గుర్నాధం మాటలకి అదిరిపోయింది.లచ్చి

"ఎందుకుమావా! పండగపూటా ఇలా అంతావు.

నువ్వే కదా సెప్పినావు ఇవాళ గిరాకీ చానా బాగుంది ఇవాళ కాస్త ఆలీసమవుతుంది అని కబురు చేసావు." అనంటున్న భార్య మాటకి తల పట్టుకుని "నీకు తెలియదే! నేను చెప్పలేనే!

అనంటున్న గుర్నాధాన్ని ని దగ్గరకు తీసుకుని "పోనీ ! ఏదో దడుచుకున్నట్లున్నవేమో! ఇంతమందున్నాము ఎందుకు భయ్యం" ఉండు కాస్త దిష్టి తీస్తాను. "

"ఒరేయ్ సాంబా నాన్నను పట్టుకో! నేను ఉప్పుమిరపకాయలు పట్టుకొస్తాను. రేపు పంతులునడిగి తాయతు కట్టిస్తాను అంటూ లోనికెళ్లింది.

భార్యమాటలకి కాస్త ధైర్యం తెచ్చుకున్నాడు గుర్నాధం కాని అతని కి మళ్లీ అవే ఇవాళ్టి జ్ఞాపకాలు.వరసగా గుర్తొస్తున్నాయి.


సంక్రాంతి పండుగ తిరనాళ వలన చుట్టుపక్కల గ్రామాల లో ఉండే పల్లెజనాలతో తమ టౌనంతా కిటకిటలాడుతోంది.

అంబికా థియేటర్ ఎదురుగా తన కిళ్లీషాపు తన గ్రామఫోన్ రికార్డ్స్ పాటకి రూపాయి ఇచ్చి విని పోతూ ఉంటారు.

ఇవాళ పొద్దున్నుండి ఒకటే జనం తిరణాల కెళ్లి , మొదటాట సినిమా చూసి వెంకటస్వామి మిలిటరీ హోటల్ లో కోడిపలావ్ తిని తన షాపులో కిళ్లి బిగించి ఇష్టమయినపాట ఇనుకోడం అదో సరదా! అందుకే ఈ పండుగ వారమంతా రాత్రి పన్నెండింటి దాకా షాపు కట్టడు.

ఇవాళ సరిగ్గా పన్నెండున్నరకి షాపు మూసేద్దామనుకుంటుంటే, ఓ రెండు జంటలు ఊడిపడ్డాయి.


అనకుుడే షాప్ మూసేత్తావేంటి గుర్నాధమా! అనుకుంటు అక్కడే బెంచి మీద చతికిలపడి

ఈయాల మా బావమరిది పెల్లి రోజు గానాబజానా అద్దిరిపోవాలా ఎయ్యి అలాటి పాటేయ్యి! అంటూ ఒక తెల్లపైజామా వేసుకున్న కుర్రోడు అడావిడి సేత్తాఉంటే తనకీ ఉసారు హెచ్చి " ఇదిగో తెల్లచీర ఇవిగో మల్లెపూలు " ఏసాడు. దానికి తెల్లచీరలు ఏసుకున్న ఇద్దరాడంగులు ఆ ఇద్దరబ్బాయిలు ఏం డాన్సులు కట్టారంటే! ఆ డాన్సులుఅయి చూసి తనకీ ఊపొచ్చేసినాది.

అలా ఓ నాలుగు పాటలు ఏసి వాళ్ల డాన్సులు గెంతులు చూసి అలుపొచ్చి "ఇంక షాప్ కట్టేయాల డబ్బులియ్యండే !అంటే "అగెహే! ఇప్పుడు భయంకరమయినపాటలు ఎయ్యి. అప్పుడిత్తాము డబ్బులు!

 అని ఇకటంగా నవ్వులు. తనకేదో విచిత్రంగా అనిపిచ్చింది. అయినా ఆ డబ్బులకి ఆశపడి

ఏ పాట కావాలి అనడిగితే "నందికొండ వాగుల్లో! కావాలని ఆ వెంటనే కాష్మోరా కౌగిలిస్తే ఏంచేస్తావు. నినువీడని నీడను నేనే!

ఇది పూవులు పూయని తోట వంటి పాటలు ఒకోటి పదేసి సార్లు వేసి రెక్కలు పడి నిద్ర ముంచుకొచ్చి" కొట్టుకట్టేస్తాను డబ్బులు ఇయ్యండి! అనిగట్టిగా అడిగాడు.


దానికొకడు తన గూబమీద ఒకటి గుయ్యిమనిపించి."అయి లేకే కదరా! మేమంతా రికార్డింగ్ డాన్సులు చేసిందీ! అయ్యన్నీ చూసినావు కదా! ఆ పాటలన్నీ నువ్బూ ఇన్నావు కదా! నువ్వే మాకియ్యాల ఇయ్యి !అని మీద మీదకి వచ్చి కిళ్లీ మీద కిళ్లీలు కట్టించి నమిలి, అయ్యన్నీ తనమీదే ఊసి, గలాటా చేస్తంటే, తనకి బయం ఏడ్పు ఒకసారే వచ్చి "ఎందుకయ్యా !నన్నిట్లా చంపుతున్నారు దెయ్యాల్లాగా ఈ అర్ధరాత్రి అంకమ్మ శివాలు! అనరిస్తే కర్ణకటోరమయిన నవ్వులతో తన గుండెలదిరిపోయి బిక్కమొహమేస్తే "నీకా డౌట్ ఏందెహె! మావు కలాకారులం కాని ఇప్పుడు దెయ్యాలమే! "మొన్నామధ్య పేపర్ లో చదవలేదా! పిచ్చినాయాలా! రికార్డింగ్ డాన్స్ కని తిర్నాలకొచ్చి సంద్రంలో కొట్టుకుపోయిన డాన్సర్స్ అని మా పుటోలు, పేర్లు తాటికాయంత అచ్చరాలతో వచ్చినాది గాదేటి! మావంతా ఆర్టిస్ట్ లం కామేంటి! ప్రాక్టీస్ కి నీ దగ్గరకే రావాల"! అని గాల్లో తేలుతున్న వాళ్ల నలుగురిని చూసి స్ప్రహ తప్ప ఇ పడిపోయాడు. ఆనక తనని ఎవరో ఇంట్లో పడేసి పోయారని తెలివొచ్చాక తెలిసింది.


ఇంక ఆషాప్ కి ఆ దెయ్యాలు రోజూ వచ్చి కూసుంటే తనేమైపోవాల అనుకుని గజ గజ వణుకుతూ ఉన్న గుర్నాధానికి తనకి దిష్టి తిప్పుతున్న లచ్చికి ఆ ఇసయమంతా ఎలా చెప్పాలా అనుకుంటుంటే అప్పుడే తలుపు కొట్టిన శబ్దం వినిపించింది.


"ఈ రాత్రేల ఎవరబ్బా !అంటూ తలుపు తీసిన కొడుకుని "పాటలు ఏసే గుర్నాధం ఇల్లేనా! మేము ఆర్టిస్ట్లం, ఇయాల పాటలు వినాల ఈయాల మా బావమరిది పెల్లిరోజు. అని అంటున్న ఆ కర్ణకటోరమైన గొంతు వినగానే బిగుసుకుపోయాడు గుర్నాధం.


 ఏమవుతుందో అని బిక్కు బిక్కు మంటు గడగడ వణుకుతున్న గుర్నాధాన్ని పక్కన రూపాయి కాసంత బొట్టుతో తీరువుగా ఉన్న లచ్చిని చూడగానే " అరేయి ఇది మన లచ్చిమి ఇల్లురా! ఆడు దాని మొగుడెహే! మనం గుర్పాతు పట్టనే లేదు మన అల్లుడు గారే! అనవసరంగా బాధ పెట్టామర్రే! వదిలేద్దారి! అనుకుంటూ మాయమైన వాళ్ల ని చూసి "హయ్యో మావా! ఆల్లెవరనుకున్నావ్ మా బాబాయోళ్లే ! ఆల్ల బాడీలు కూడా దొరక్క ఆల్లకేమీ చేయనేదు. రేపే ఆల్లకేదయినా చేసి ముక్తి కలిగించాలా ! అని కళ్లనీళ్లెట్టుకుంటున్న లచ్చి ని చూసి ,

"బతికిపోయానే లచ్చీ నీమొగుడునయి ఆవేవో తొందరగా చేపియ్యి. ఎంతమందిని ఏడిపిస్తున్నాయో ఈ మాయదారి దెయ్యాలు. పైగా కలాకారులం! కలాకారులంటే ఇలా పోయాక కూడా కాల్చుకు తింటారా ఈల మొహం మండా! అని అంటూ

తన మాటలు విని కోపంగా చూస్తున్న లచ్చిని చెంపలు వేసుకుని నోరు నొక్కుకున్నాడు గుర్నాధం.


Rate this content
Log in

Similar telugu story from Drama