Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

యశస్వి రచన

Fantasy

3  

యశస్వి రచన

Fantasy

టైం మెషిన్ -2

టైం మెషిన్ -2

6 mins
285


Date@20/06/2143

Time@Around 09:30

Place@Some where in Ocean


"సబ్మెరైన్ నుండి సమీర్ సముద్రం వంక చూస్తున్నాడు.చాలా జీవులు చలనం లేకుండా పడివున్నాయి.తన మనసులో ఏదో తెలియని బాధ.కానీ అది బయటకి కనిపించకుండా జాగ్రత్త పడుతున్నాడు.కానీ జియా అది గమనించింది"


"మిష్టర్ సమీర్ ఎందుకని ఇండియాన్స్ టైమ్ మెషిన్ ని కనిపెట్టాలి అనుకున్నారు అని అడిగింది జియా"


"సబ్మెరైన్ లో వున్న అందరూ ఒక్కసారిగా ఆసక్తి గా సమీర్ వంక చూస్తున్నారు"


"చూడండి ఫ్రెండ్స్ మనం ఏ పనిచేసినా లాభం కోసమో లేకపోతే సంతృప్తి కోసమో చేస్తాము.అలాగే ఇండియన్ గవర్నమెంట్ కూడా ఒక మంచి ప్రయోజనం కోసం ఈ ప్రాజెక్టు ను మొదలుపెట్టింది.దీని గురించి అనేక వదంతులు వచ్చాయి. యు ఎస్ లో వున్న వున పెంటగాన్ ఏరియా 51 లో నేను పని చేసే వాడిని. అక్కడ మేము హైలీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అయినా ఫ్యూజన్ ఎనర్జీ మీద వర్క్ చేసే వాళ్ళము.నిజానికి ఈ ప్రయోగం గురించి ఆ దేశ ప్రెసిడెంట్ కి కూడా తెలియదు. ఇది అంతా ఆదేశ మిలటరీ చీఫ్ అర్దర్ మేనేజ్ చేసేవాడు"


"అంతా బాగానే వుంది కాని సడన్ గా నన్ను ఉద్యోగం నుండి తీసేసారు.పెంటగాన్ నుండి బయటకు వచ్చేటప్పుడు వాళ్లు యూ ఎస్ భద్రత రహస్యాలు బయటికి నా వల్ల లీక్ అవుతాయి అని వాళ్లు నన్ను ఒక న్యూరో సిమ్యులేటర్ లో పంపి మెదడులో వున్న కొన్ని న్యురాన్స్ నీ సప్రెస్ చేశారు.అందువల్ల నాకు జస్ట్ పెంటగాన్ లో పని చేశాను అని మాత్రమే గుర్తు వుంది.కానీ కొన్ని రోజులు నుండి తల తీవ్రమైన నొప్పి వచ్చి ఆ విషయాలు గుర్తు వస్తున్నాయి.ఎందుకో అర్ధం కావటం లేదు.నేను తిరిగి ఇండియా వెళ్ళిపోయాను.అక్కడ నన్ను మిష్టర్ బెన్ మీట్ అయ్యి ఇండియా రహస్యం గా డీల్ చేస్తున్న టైమ్ మెషిన్ ప్రాజెక్ట్ గురించి చెప్పి నన్ను కూడా మెంబర్ గా జాయిన్ అవ్వమని అడిగాడు.నేను కూడా సరే అన్నాను"


"కొన్ని రోజులు అందరం కలసి బాగా వర్క్ చేసి ఒక టైమ్ పోర్టల్ నీ క్రియేట్ చేశాము.ఆ టైమ్ పోర్టల్ లో చాలా టైమ్ లూప్స్ వున్నాయి.అందువల్ల మనం అనుకున్న టైమ్ కంటే ముందుగా గాని లేకపోతే ఆ తర్వాత గానీ మనం అనుకున్న టైమ్ కి వెళ్తాము.మేము ఎంత కష్టపడిన ఆ టైమ్ సిక్వెన్స్ నీ కనిపెట్టలేకపోయాము.కొన్ని సందర్భాల్లో ఎనర్జీ ఫ్లక్చువేషన్స్ వచ్చి పోర్టల్ మద్యలో ఆగిపోయేది.అప్పుడు మా టెస్టింగ్ అబ్జెక్ట్ యొక్క సిగ్నల్ మాకు అందేది కాదు. సో అది వేరే టైమ్ లూప్ లొ ఇరుకుని పోయింది అని అర్థమైంది మాకు"


"కొన్ని రోజులు కష్టపడి ఒక సిక్వెన్స్ కనిపెట్టాను.కానీ ఎనర్జీ ఫ్లక్చువేషన్స్ వల్ల మేము మళ్లీ తిరిగి ప్రయత్నించలేదు.నేను ఆ ఎనర్జీ ఫ్లక్చువేషన్స్ నీ ఎలా కంట్రోల్ చెయ్యాలి అని బాగా ఆలోచిస్తూ వున్నాను.నా ఆలోచనలు వల్ల సప్రెస్ అయిన నూరన్స్ మళ్లీ యాక్టివేట్ అయ్యి నాకు పెంటగాన్ లో నేను చేసిన ఫ్యూజన్ ఎనర్జీ గురించి గుర్తు వచ్చి.ఒక ఫ్యూజన్ రియాక్టర్ క్రియేట్ చేసి దాంట్లో హైలీ అన్ స్టేబుల్ అయినా తోరియం అండ్ ట్రై నైట్రో టొలిన్ నీ హై ఇగ్నీషన్ వద్ద ఫ్యూజన్ చేసి వచ్చే ఫ్యూజన్ ఎనర్జీ నుండి ఆ ఎనర్జీ ఫ్లక్చువేషన్స్ నీ కంట్రోల్ చేశాను.ముందుగా నేను ఒక లైవ్ ఫామ్ నీ టైమ్ లూప్ లోకి మన వున్నా టైమ్ కంటే కొంచెం ఒక పది నిమిషాలు ముందుగా పంపి టెస్ట్ చేశాము అది సక్సెస్ అయ్యింది"


"మేము టెస్ట్ చేసిన లైవ్ ఫామ్ కి టైమ్ లూప్ లొ ఏమీ అవలేదు అందువల్ల నేను ఈ సారి ఒక మనిషిని టైమ్ లూప్ లోకి పంపాలి.అనుకున్నాము.కానీ మేము ప్రయోగం చేసిన మొదలు పెట్టిన కొన్ని నిమిషాలకు కొన్ని సాంకేతిక సమస్య తలెత్తి ఫ్యూజన్ రియాక్టర్ నుండి తొరియం అండ్ ట్రై నైట్రో టొలిన్ లీక్ అయ్యి ఎనర్జీ లెవెల్స్ పడిపోయి.ఆ టైమ్ మెషిన్ లో వున్న వ్యక్తి మేము సెట్ చేసిన టైమ్ కంటే దాదాపు ఒక వంద సంవత్సరాల ముందుకి వెళ్ళిపోయాడు.ఆ తర్వాత అతడు ఎవరికి కనిపించలేదు.ఇండియా గవర్నమెంట్ కి మా టీమ్ ఒక నివేదిక రెఢీ చేసింది. టైమ్ ట్రావెలింగ్ కి కావలసిన స్టేబుల్ ఎనర్జీ సోర్సెస్ మనకు లేకపోవటం వల్ల ఈ ప్రయోగం ముందుకు వెళ్ళటం లేదు అని.అలాగే ఆ స్టెబుల్ ఎనర్జీ సోర్స్ కనిపెట్టెంత వరకు ఆ టైమ్ మెషిన్ నీ ఒక సీక్రెట్ బంకర్ లో వుంచారు.మనం ఇప్పుడు ఆ బంకర్ లో వున్న టైమ్ మెషిన్ కోసమే వెళ్తున్నాము" అని చెప్పి మళ్ళీ సముద్రం వైపు చూస్తాడు సమీర్.


"మిష్టర్ సమీర్, ఆ మొదటి టైమ్ ట్రావెలర్ మరి ఇప్పుడు బ్రతికి వున్నాడా వుంటే అతను ఎక్కడ వుండే అవకాశం వుంది అని అడిగింది జియా"


"అంతటి లోకి పెర్క్ నుండి విడియో కాల్ వచ్చింది.అందరూ స్క్రీన్ చూస్తున్నారు కింగ్ మాట్లాడుతున్నాడు.ఇప్పుడు మీ అందరికీ నేను ఒక వ్యక్తిని పరిచయం చేస్తాను అని కెమెరా ను పక్కకు తిప్పుతాడు.అంతే అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు.ఎందుకంటే అక్కడ సమీర్ వున్నాడు.అందరూ ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తారు సబ్మెరైన్ లో వున్న సమీర్ సముద్రం వంక చూస్తూ వుంటాడు. ఎవరి నోటి వెంట మాట లేదు అందరూ స్క్రీన్ లో వున్న సమీర్ నీ బయట వున్న సమీర్ నీ చూస్తూ ఉండిపోతారు"


"అప్పుడు కింగ్...,

చూడండి ఫ్రెండ్స్ ఆల్రెడీ మీకు ఇప్పుడు సమీర్ గురించి తెలిసే వుంటుంది ఎందుకంటే లోపల వున్న మైక్రో ఫోన్ ద్వారా మీ సంభాషణ నేను విన్నాను.సో అస్సలు విషయం మీకు చెప్పాలి అని కాల్ చేశాను.ఆ టైమ్ లూప్ లో ఇరుకున్న మనిషి ఎవరో కాదు మన సమీరే. ఇప్పుడు నా దగ్గర వుంది ప్రస్తుత సమీర్ అలాగే మీ దగ్గర వుంది గతం నుండి వచ్చిన సమీర్.నాకు మీ డౌట్ అర్దం అయ్యింది గతం లో వున్న సమీర్ టైమ్ లూప్ లో వుంటే ఇప్పుడు మన దగ్గర సమీర్ ఎలా వున్నాడు అనే కదా.అదంతా పెద్ద స్టోరీ మీకు నేను తర్వాత చాలా వివరంగా చెప్తాను.ముందు మీరు ఆ బంకర్ నీ తీసుకు రండి అని కాల్ కట్ చేశాడు కింగ్"


(అందరూ ఆశ్చర్యం గా సమీర్ నీ గమనిస్తున్నారు)


అప్పుడు సమీర్ "మీకు ఇంకా నమ్మకం కుదరలేదు కదా అని జియా చేతి నీ పట్టుకుని గట్టిగా తన దగ్గరకు లాగుతాడు.అందరూ ఒక్కసారిగా భయపడతారు.జియా చేతికి ఉన్న వాచ్ నీ తీసి తన చేతికి పెట్టుకున్నాడు.ఆ వాచ్ లో వున్న వున్న మూడు మూలుల్లు చాలా వేగంగా తిరగసాగాయి.అందరూ అలా చూస్తూ ఉండిపోయారు.తర్వాత ఆ వాచ్ తీసి జియాకి ఇచ్చాడు"


(కొన్ని నిమిషాలు వాళ్లు అందరూ సైలెంట్ గా ఉండిపోయారు.కొన్ని నిమిషాల తర్వాత అందరూ ఆ ఆశ్చర్యం నుండి తేరుకున్నారు)


జియా సమీర్ మీద ప్రశ్నల వర్షం కురిపించింది.


(సమీర్ అండ్ జియా కి మధ్య సంభాషణ)


"మీరు టైమ్ ట్రావెల్ లో ఉన్నపుడు మీరు ఎంత వేగం తో వున్నారు"


"సుమారు నేను కొని పదుల కాంతి సంవత్సరల వేగంతో వున్నాను"


"మీకు ఈ మూడవ ప్రపంచ యుద్ధం ఎందుకు మొదలు అయ్యింది అనే విషయం మీకు తెలుసా, ఒక వేళ తెలిస్తే మీరు ఎందుకని ఆ ఆపటానికి ప్రయత్నించలేదు?"


"నాకు తెలుసు కానీ నేను దానిని ఆపకూడదు.ఒకవేళ నేను ఆపటానికి ప్రయత్నిస్తే నేను శాశ్వతం గా ఈ టైమ్ లూప్ లోనే వుండి పోవాలి.ఎందుకంటే నాకంటూ కొన్ని పరిమితులు ఉన్నాయి.వాటిని నేను క్రాస్ చేస్తే ప్రమాదం.అందుకే నేను కింగ్ హెల్ప్ తీసుకుని మీ టైమ్ జోన్ లో వున్న ఒక వ్యక్తినీ నా టైమ్ జోన్ కి పంపి ఈ యుద్ధం అని ఆపాలి అనుకుంటున్నాను"


"మీకు టెక్నికల్ గా ఇప్పుడు సుమారు ఎన్ని సంవత్సరాలు?"


"సుమారు గా నాకు ఇప్పుడు 125 సంవత్సరాలు"


"మరి మీకు 125 సంవత్సరాలు అయితే ప్రస్తుతం వున్న సమీర్ ఎప్పుడో చనిపోవాలి కదా మరి ఎందుకు చనిపోలేదు"


"చూడు జియా నేను దాదాపు వంద సంవత్సరాలు టైమ్ లూప్ లొ వుండి పోయాను.కానీ రియల్ వర్ల్డ్ నేను గడిపింది కేవలం 25 సంవత్సరం లు మాత్రమే.దీని గురించి వివరంగా గా నేను మనం టైమ్ మెషిన్ తీసుకువచ్చిన తర్వాత చెప్తాను"


"మీకు ఇప్పుడు నెక్స్ట్ ఎం జరగబోతుందో మీకు తెలుస్తుందా?"


"లేదు లేదు నాకు కేవలం నా టైమ్ జోన్లో అంటే నేను నా నిజమైన టైమ్ జోన్లో ఉన్నపుడు జరిగినవి మాత్రమే నాకు ముందుగా తెలుస్తుంది.ఇంకా క్లియర్ గా చెప్పాలి అంటే నేను టైమ్ లూప్ లోకి వెళ్ళే ముందు వరకు ఏమేమి జరిగాయో నాకు తెలుసు అంతే "


"ఇప్పుడు మనం ఆ టైమ్ మెషిన్ ద్వారా మనం అనుకున్న విధంగా గా ఆ యుద్ధం ఆపితే.మనం తప్పకుండా కొత్త ప్రపంచం చూడ్డచా?"


"నూటికి నూరు శాతం మనం చూడచ్చు"


"మరి ఇప్పుడు మీరు ఆ టైమ్ లూప్ లోకి ఎవర్ని పంపుతారు"


"ఆ టైమ్ లూప్ లోకి నేను గాన్ మీ టైమ్ జోన్ లో వున్న సమీర్ గాని వెళితే అది మా ప్రాణాలకే ప్రమాదం అందుకే నేను సమీర్ తముడిని పంపాలి అని ఆలోచిస్తున్నాను"


Date@20/06/2143

Time@Around 12:00

Place@Some where in Ocean


(అందరూ లంచ్ చేసి పడుకున్నారు అండ్ వైట్ సబ్మెరైన్ నీ నడుపుతున్నాడు)


"మార్ష్ తన టీమ్ తో పాటు సబ్మెరైన్ నీ ట్రాక్ చేస్తూ ఫాలో అవుతున్నాడు.సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నాడు.అందరి దగ్గర వున్న ఫిల్టర్ లు మెల్లగా తగ్గిపోతున్నాయి"


"చాలా ప్రశాంతం గా సాగుతున్న ప్రయాణం లో ఒకసారిగా పెద్ద శబ్దం వచ్చింది.అందరూ నిద్ర నుండి మేల్కొనారు.ఏమైంది అని చూస్తే సబ్మెరైన్ డోమ్ భాగం లో ప్రెషర్ పెరిగి సిలిండర్ లో వున్న కంప్రెస్డ్ ఆక్సిజన్ లీక్ అయిపోయింది.అందువల్ల సిలిండర్ లు ఒకదాని ఒక్కటి వేగం గా గుద్దుకున్నాయి.వాళ్ళ దగ్గర వున్న ఆని ఆక్సిజన్ సిలెండర్ లు ఖాళీ అయిపోయాయి"


"అందరికీ ఎం చెయ్యాలో అర్దం కావటం లేదు.ఇండియాకి వెళ్ళిన తర్వాత ఉపరితలం మీద మనం ప్రయాణం చేయాలి అంటే మనకు ఆక్సిజన్ తప్పకుండా కావాలి.ఇప్పుడు ఎలా అని అందరూ టెన్షన్ పడతారు"


"అప్పుడు కేన్, మనకు దగ్గరలో ఒక పెద్ద హాస్పిటల్ వుంది.మనకు అక్కడ ఆక్సిజన్ సిలిండర్ లు దొరకవచ్చు అంటాడు.కానీ విప్లవకారులుకి కూడా హాస్పిటల్ లో ఆక్సిజన్ సిలిండర్లు వుంటాయి అని తెలుసు ఒకవేళ వాళ్ళు ముందే తీసుకు పోతే మన పరిస్థితి ఎంటి? అంటాడు వైట్"


"అపుడు జియా మనం ఈ ఛాన్స్ తప్పకుండా తీసుకోవాలి.అన్ని సిలిండర్లు లో మిగిలిన ఆక్సిజన్ నీ కలెక్ట్ చేసి ఒక సిలిండర్ లో నింపి మనలో, ఒక్కళ్ళు వెళ్లి అక్కడ వుండే సిలిండర్లు తీసుకురావాలి అంది"


"అప్పుడు అందరూ సరే అన్నారు సమీర్ మాత్రం యధావిధిగా సముద్రం వంక చూస్తూ ఉన్నాడు.కేన్ సబ్మెరైన్ నీ హాస్పిటల్ వైపు మళ్ళించాడు.మార్ష్ వాళ్ళ టీమ్ కూడా వాళ్ళని ఫాలో అవుతున్నారు"


"మాస్టర్ థరణ్ వేరే టీమ్ తో అదే హాస్పిటల్ కి ఆక్సిజన్ సిలిండర్లు కోసం వస్తున్నాడు"


"సబ్మెరైన్ నీ లోతు తక్కువ వుండటం వల్ల ఆపి.సముద్రం పైకి తీసుకు వచ్చారు.అపుడు జియా ఒక లైఫ్ బోట్ లొ ఆక్సిజన్ సిలిండర్ వేసుకుని తీరం చేరింది.ఇది గమనించిన మార్ష్ ఇదే వాళ్ళ మీద ఎటాక్ చేయటానికి సరైన సమయం అనుకుని ప్లాన్ రెఢీ చేసుకుని దాడికి సిద్ధం గా వున్నాడు.


To be continued in the next parts.....



Rate this content
Log in

Similar telugu story from Fantasy