Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Thulasi Prakash

Drama

3.4  

Thulasi Prakash

Drama

శాన్వి

శాన్వి

8 mins
494


మనసు కధలు



శాన్వి, నరేన్, సంగీత, రేవంత్ నలుగురూ ఇంజనీరింగ్ కాలేజీలో మంచి ఫ్రెండ్స్ ...

ఆ సంవత్సరం కొత్తగా చేరింది ప్రియ...

తెల్లని చుడీదార్లో బాందినీ ప్రింట్ ఎర్ర చున్నీతో 

తగు సన్నమూ, పొడుగుతో చాలా అందంగా, హుషారుగా ఉంది...స్కూటీ ఆపి క్లాస్ లోకి వెళుతోంది ప్రియా.. 

రేవంత్ స్వతహాగా అల్లరోడు..సరదాగా చిలిపి మాటలతో ఉత్సాహంగా ఉంటాడు..


ప్రియాని చూడగానే రేవంత్ మదిలో కొత్తరాగాలు మెదిలాయి...ఎంత సక్కగున్నవే అని పాడేసుకున్నాడు...అరేయ్ పదండ్రా కొత్తగా చేరినమ్మాయిని రాగింగ్ చెయ్యాలి కదా అని ఫ్రెండ్స్ ని బయలుదేరమన్నాడు ప్రియాని ఆట పట్టించటానికి..


శాన్వి చెప్పింది..తనేమి ఫస్ట్ ఇయర్ అమ్మాయి కాదు..మనలానే థర్డ్ ఇయర్ స్టూడెంట్ ..

వాళ్ళు వేరే ఊరినించీ ట్రాన్స్ఫర్ అయి వచ్చి ఇక్కడ చేరింది..రాగింగ్ ఇప్పుడేందిరా అర్ధం లేకుండా అని రేవంత్ ని వారించింది..


అయితే సరే ఫ్రెండ్షిప్ చేసుకుందాం పదా అని వెళుతున్నాడు..ఏంట్రోయ్ అని విజిల్ వేసాడు నరేన్ రేవంత్ ని ఉద్దేశ్యించి..


ప్రియా ప్రియా చంపొద్దే అని జీన్స్ మూవీ పాట పాడి సమాధానం ఇచ్చాడు రేవంత్ నరేన్ ప్రశ్నకి..ఆహా అలానా అని అర్ధమయినట్లుగా శాన్వి సంగీత నరేన్ అన్నారు..


ప్రియ క్లాసులోకి వెళ్ళి కూర్చుంది..


రేవంత్ బ్యాచ్ క్లాసుకొచ్చి ఓయ్ ఫ్రెండ్స్ పిక్నిక్ లో పాడేవాళ్ళు పేర్లు చెప్పండి అని అంటూ ఎదురుగా కూచున్న ఓ స్టూడెంట్ నుంచీ బుక్ పెన్ ఇప్పించుకుని పేర్లు నోట్ చేసుకుంటున్నారు...


ఓ నలుగురు తమ పేర్లు చెప్పారు..రేవంత్ ప్రియని చూసి అడిగాడు..ఏంటి నీ పేరు ఇవ్వవా..  

న్యూ అడ్మిషన్ కదా నువ్వు..పాటలొచ్చా నీకు అని అడిగాడు..ప్రియ నా పేరు అంది..సరే మరి సాటర్డే పిక్నిక్ లో కలుద్దాం అని రేవంత్ వాళ్ళు వెళ్ళిపోయారు..


మర్రోజు రేవంత్ కాలేజుకి ఓ పదినిముషాలు ముందే వచ్చి పార్కింగ్ ప్లేస్ లో ఎదురుచూస్తున్నాడు...ప్రియ స్కూటీ మీద వచ్చింది..పార్కింగ్ లో బండి ఆపి వెళ్ళబోతోంది...ప్రియా అని పిల్చాడు రేవంత్..ప్రియ ఆగి చూసింది...గుడ్ మార్నింగ్ చెప్పాడు రేవంత్..గుడ్ మార్నింగ్ అని బదులు చెప్పింది ప్రియ...తన దారిన తను వేగంగా క్లాసుకెళ్ళిపోయింది..


రేవంత్ కి ఇంకాఏదో ప్రియతో మాట్లాడాలి అనిపిస్తోంది...కానీ ఎలా అనేది అర్ధం కావట్లేదు...


సాటర్డే రేవంత్ వాళ్ళు ప్లాన్ చేసిన ఓ పార్కులో పిక్నిక్ ఎరేంజ్ మెంట్స్ జరిగాయి...చిన్న స్టేజ్ మైక్ సెట్టింగ్..మంచి లంచ్..చిన్నచిన్న పోటీలు, వాటి కోసం చిన్నచిన్న బహుమతులూ అన్నీ రెడీ అయ్యాయి...


ప్రియ కూడా రేఖతో పాటూ వచ్చింది..అంతా బాగా జరిగింది...ప్రియకి కొత్త పోయి అందరితో బాగా కలిసిపోయింది...


థర్డ్ ఇయర్ పరీక్షలు జరుగుతున్నాయి..ఇంకో నాలుగురోజుల్లో ఒక వారం శెలవులు దొరుకుతాయి...రేవంత్ తమ ఊరు చాలా బావుంటుంది..తాతగారి పెద్ద మండువా ఇల్లు చుట్టూ పచ్చటి పొలాలు ఊరిబయట కొండమీద పురాతన వేణుగోపాలస్వామి గుడి..ఆ కొండమీద నుంచీ మంచి ప్రక్రుతిదృశ్యం అన్నీ ఆశ్వాదించచ్చు అని తమ ఊరికి ఆహ్వానించాడు తన ఫ్రెండ్స్ అందరినీ...


ప్రియ రాలేనని చెప్పింది..ప్లీజ్ ప్రియ చాల మంచి ట్రిప్ అవుతుంది..మిస్ అవ్వకు..ప్లీజ్ అని రేవంత్ ప్రియని బతిమలాడాడు..


లేదు రేవంత్ కుదరదు..అర్ధం చేసుకో అని చెప్పేసింది ప్రియ..శాన్వి వాళ్ళు కూడా అడిగారు ప్రియని పల్లెటూరికి వెళ్ళొద్దాము, బావుంటుంది రమ్మని...అయినా ప్రియ చెప్పింది..సారీ కుదరదూ అని..


ట్రిప్ ప్లాన్ చేసాక మానేస్తే బాగోదని రేవంత్ మిగిలిన ఫ్రెండ్స్ ని తీసుకుని శెలవల్లో ఊరెళ్ళివచ్చాడు...


ఈ శెలవల్లో నెట్ సిగ్నల్స్ సరిగ్గా లేక ప్రియతో అప్పుడప్పుడు మాత్రమే మాట్లాడగలిగారు శాన్వి వాళ్ళు..


సిటీకొచ్చాక రేవంత్ కి తెలిసింది...ప్రియకి పెళ్ళి కుదిరిందీ అని...అరే ఇంత చిన్నవయసులో ఎవరైనా ఈ రోజుల్లో పెళ్ళి చేసుకుంటున్నారా ప్రియా.. నీకెందుకు ఇప్పుడే పెళ్ళొద్దు అని చెప్పాలనించలేదు అని ప్రియని అడిగారు శాన్వి వాళ్ళు..


మేము ఇదివరకు బాగా బతికినవాళ్ళము, ఇప్పుడు ఆస్థులు పోయి ఇబ్బందుల్లో ఉన్నాము...అనుకోకుండా నాన్న ఫ్రెండ్ తమ అబ్బాయికి నన్ను అడిగారు..ఎలానూ ఇప్పటిలో పెళ్ళికి సరిపడా ఎక్కువ డబ్బులు సమకూర్చుకోవడం కష్టం మాకు..వాళ్ళంతట వాళ్ళే అడిగిన సంబంధం పైగా మా ఫామిలీ అంటే ఇష్టం ఉన్నవాళ్ళు..వారి ఇంటిలో నేను బావుంటాను అని నాన్న నా పెళ్ళికి ఒప్పుకున్నారు అని ప్రియ చెప్పింది..ప్రియ మాటలు విన్న రేవంత్ కళ్ళు బాధతో కోపంతో ఎర్రబడ్డాయి..శాన్వి అది చూసి రేవంత్ ని చెయ్యిపట్టుకుని పక్కకు తీసుకెళ్ళాలని చూసింది...


రేవంత్ శాన్వి చెయ్యి విదిలించుకుని, ప్రియ చెయ్యి పట్టుకుని , తీసుకెళ్ళి , లైబ్రరీ బయట ఉన్న గ్రౌండ్ లో బల్లమీద ప్రియని కూర్చోపెట్టాడు..ఏం జరుగుతోందో ప్రియకు అర్ధం కాలేదు..


రేవంత్ ప్రియ వైపు చూస్తున్నాడు..కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి రేవంత్ కి..ప్రియ అర్ధం కానట్టు భయం భయంగా చూస్తోంది...ప్రియా నువ్వంటే నాకు చాలా ఇష్టం..నువ్వు మొదటిరోజు కాలేజీలో చేరగానే నేను నిన్ను ఇష్టపడ్డాను...నీతోనే నా జీవితమంతా అని నిర్ణయించేసుకున్నాను..నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రియా అని చెప్పాడు..ఆవేశంగా మొదలుపెట్టి...ఏడుపుగొంతుతో ముగించాడు రేవంత్..ప్రియకి తలమీద పెద్ద భారం పెట్టినట్టయ్యింది..


ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు..నాకు పెళ్ళి కుదిరింది, నేను ఒప్పుకున్నాకే నా పెళ్ళి నిశ్చయించారు,అంటే నేను ఆ అబ్బాయిని నా భర్తగా అనుకునే కదా పెళ్ళికి సిద్ధమయ్యాను, ఇలాంటి పరిస్థితిలో నాతో నువ్వు ఇలా చెప్పడం పద్ధతి కాదు..కానీ నీ ఆవేశాన్ని అర్ధం చేసుకుంటున్నాను..దయచేసి ఇంకెప్పుడూ నాతో ఇలా మాట్లాడద్దు...అని ప్రియ లేచి వెళ్ళబోయింది..


ప్రియ భుజం మీద చెయ్యి బలంగా ఉంచి ప్రియని వెళ్ళకుండా ఆపి రేవంత్ చెప్తున్నాడు.... 

ప్రియా నువ్వు లేకుండా నేను నా భవిష్యత్తుని ఊహించుకోను కూడా లేనూ..నువ్వు లేకుండా బతకాలంటే నావల్ల కాదు ప్లీజ్ ప్రియా.. నీ పెళ్ళిని కాన్సిల్ చెయ్యి..నన్ను పెళ్ళిచేసుకో అని మొండిగా మాట్లాడాడు రేవంత్..


రేవంత్ నువ్వు ఏ కాలంలో ఉన్నావు..నా ఇష్టంతో కుదిరిన మా పెళ్ళిని ఆపెయ్యమని ఎలా అడుగుతున్నావు...కొంచెం కోపం తగ్గించుకుని కుదురుగా ఆలోచించు..కనీసం సాటిమనిషిగా నేనింకా నిన్ను గౌరవిస్తున్నాను...అని స్థిరంగా చెప్పింది ప్రియ..


చేతిలో ఉన్న పుస్తకాన్ని దూరంగా విసిరికొట్టాడు రేవంత్..


మర్రోజు కాలేజీకి అందరూ మామూలుగానే వచ్చారు...మద్యాహ్నం మూడింటికి లెక్చరర్ వచ్చేలోపు ఉన్న ఖాళీసమయంలో ప్రియా నీతో మాట్లాడాలి ప్లీజ్ కమ్ అనేసి రేవంత్ క్లాసు బయటకి నడిచాడు..ప్రియ కూడా సాటిమనిషిగా అతను అడిగినప్పుడు చెప్పేది వినటం తన ధర్మం అనుకుంది..


చెట్టుకింద బల్లదగ్గర రేవంత్ ప్రియనే సూటిగా చూస్తూ అడిగాడు..ప్రియా దయచేసి నా బాధ అర్ధం చేసుకో...నిన్ను మొదట్లోనే ప్రేమించినా ఇన్నాళ్ళు నేను చెప్పకపోవటానికి కారణం..మన చదువులు సాగుతున్నాయి కదా అని, చదువులు అయ్యి కెరీర్ లోకి వెళ్ళేముందు చెప్పచ్చులే అనుకున్నాను..ఇంతలో నీ పెళ్ళి అనే గండం ముంచుకొస్తుంది అనుకోలేదు...ఇప్పుడు నీకు తెలిసింది కదా నేను నీప్రేమలో పీకల్లోతు మునిగానని...ఇప్పుడైనా నా గురించి నీ పెళ్ళి ఆపెయ్యవా అని బతిమలాడాడు..


ప్రియకి చాలా బాధేస్తోంది ఈ పరిస్థితికి...రేవంత్ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని ముందే తెలిసినా నేను నిన్ను పెళ్ళి చేసుకోలేను..ఎందుకంటే నాకు నీమీద ప్రేమలాంటిది లేదు...నువ్వు నాకు శాన్వి, సంగీత, నరేన్ లాగా ఒక ఫ్రెండువి మాత్రమే..అని సర్దిచెప్పాలని సౌమ్యంగా మాట్లాడింది..


రేవంత్ తన ప్రేమను ప్రియ నిరాకరించడం సహించలేకపొయ్యాడు...తనకే తెలీని క్రూర ప్రవర్తనలోకి వెళ్ళిపోయాడు..ప్రియా నన్ను పెళ్ళి చేసుకోని నువ్వు వేరే వారిని చేసుకోవటానికి వీల్లేదు...నేను ఊరుకోను అని బెదిరించాడు ప్రియని...


ప్రియ మౌనంగా వెళ్ళిపోయింది అక్కడినుంచీ..


నెలరోజులు గడిచాయి..అంతా మామూలుగానే ఉన్నట్టనిపించింది ప్రియకి..కానీ రేవంత్ ప్రియకే తెలీకుండా ప్రియని గమనిస్తూనే ఉన్నాడు...ప్రియ రాకపోకలు, ప్రియ ఎవరెవరితో మాట్లాడుతోంది అన్నీ చూస్తూనే ఉన్నాడు రేవంత్..


ఒక ఆసిడ్ బాటిల్, ఒక పెద్దకత్తి కూడా దగ్గరపెట్టుకున్నాడు...తనది గొప్ప ప్రేమ అనుకుని.. ప్రియకు హింసని, నరకాన్ని అందించేందుకు మూర్ఖంగా అన్నీ సిద్ధం చేసుకుంటున్నాడు..


ఆ రోజు రేవంత్ కి ఒక ఫోన్ కాల్ వచ్చింది...హాయ్ రేవంత్ అని అమ్మాయి గొంతు వినిపించింది..ఎవరూ అన్నాడు రేవంత్...నా పేరు శృతి, నేను నీకు పెద్ద ఫాన్ ని తెలుసా అని మాట్లాడుతుంటే ఫోన్ కట్ చేసేసాడు రేవంత్...వెంటనే అదే నంబర్ నుంచీ మెసేజ్ వచ్చింది..రేవంత్ ఐ లవ్ యూ అని..రేవంత్ కి కోపం వచ్చి కాల్ బాక్ చేసి తిట్టబోయాడు..రేవంత్ ప్లీజ్ నా ప్రేమని అర్ధం చేసుకో అని శృతి ఏడ్చేస్తోంది..


ఛీ ఛీ అని చిరాకుగా ఫోన్ పెట్టేసాడు రేవంత్...ఇరవయి నాలుగు గంటలూ శృతి లవ్ మెసేజులు ఫోన్ కాల్సు చేసి రేవంత్ కి తన ప్రేమను తెలపాలని, రేవంత్ తో తనను ప్రేమించేలా చేసుకోవాలని విశ్వప్రయత్నం చేస్తోంది శృతి..


శృతి గోలకి తట్టుకోలేక ఫోన్ నంబర్ కూడా మార్చేసాడు రేవంత్...అయినా ఒక రోజు తేడాతో మళ్ళీ ఈ కొత్త నంబరుకి కూడా శృతి ఫోన్ చేసేది, మెసేజులు పెట్టేది...ఇక లాభం లేదనుకుని కాలేజీ కాంటీనుకి శృతిని మాట్లాడటానికి రమ్మన్నాడు...


మిస్ ఇండియా లాంటి అందమైన అమ్మాయి శృతి...రేవంత్ హాయ్ నిన్ను ఇంత దగ్గరగా చూస్తుంటే ఇంకా చాలా బావుంది...మనం పెళ్ళి చేసుకుంటే నీతో నేను ఊహించుకున్న జీవితం నిజమైతే నాకంటే ఆనందంగా ఎవ్వరూ ఉండరు...


నువ్వంటే నాకు చాలా ప్రేమ రేవంత్ అని శృతి ఆరాధనగా చెప్తోంది రేవంత్ కి...రేవంత్ కి మాత్రం ఆ మాటలు వింటుంటే పిచ్చి చిరాకు వచ్చింది...

శృతీ.. నేను ప్రియని ప్రేమిస్తున్నాను, నిన్ను ప్రేమించటం అనేది జరిగే పని కాదు...

నన్ను దయచేసి విసిగించద్దు అని చెప్పాడు...

ఎవరా ప్రియ నేను నిన్ను ఇంతలా ప్రేమిస్తుంటే 

ఇంకో అమ్మాయి గురించి నాకు చెప్తావేంటి..నేను ఎప్పటికైనా, ఎలాగైనా నిన్నే పెళ్ళి చేసుకుంటాను అని శృతి మొండిగా చెప్పింది రేవంత్ తో..


రేవంత్ మౌనంగా అక్కడినుంచీ వెళ్ళిపోయాడు...ఇదేమి తలనొప్పిరా అనుకుని మళ్ళీ ఫోన్ నంబర్ మార్చాడు..కాలేజీకి కూడా వెళ్ళట్లేదు శృతి నుంచీ తప్పించుకోటానికి..


నాలుగురోజుల తరువాత తెలిసింది...ప్రియని స్కూటీ మీద వెళుతుంటే ఒక కారు వచ్చి ఆక్సిడెంట్ చేసి వెళ్ళిపోయింది అని...ప్రియకి కాలు ఫ్రాక్చర్ అయ్యింది అని...అది చేసింది శృతి అని రేవంత్ కి తెలిసింది..


రేవంత్ కోపంగా శృతి దగ్గరికి వెళ్ళి అడిగాడు...

ప్రియ ని ఎందుకు బాధ పెట్టావు..నువ్వసలు మనిషివేనా...అని చీదరించుకున్నాడు...రేవంత్ నిన్ను పొందటానికి నేను ఇంకా దూరం వెళ్ళగలను...ప్రస్తుతానికి ఫ్రాక్చర్తోనే వదిలేసాను...అని శృతి కర్కశంగా మాట్లాడింది...


శృతి నువ్వు నన్ను ప్రేమించినంత మాత్రాన 

నాకు నీ మీద ప్రేమేలా వస్తుంది...

నాకు నువ్వంటే ఇష్టం లేదు, అర్ధం చేసుకో అని నచ్చచెప్పబోయాడు రేవంత్ శృతి కి...


నాకు నువ్వంటే పిచ్చి ప్రేమ, నేను నిన్ను వదిలే ప్రశ్నే లేదు...చంపుతాను లేదా చస్తాను అని పొగరుగా సమాధానం చెప్పింది శృతి...


నాకు నీ మీద ప్రేమ లేదంటే వదిలెయ్యకుండా ఎందుకు నన్ను ఇంత టార్చర్ పెడుతున్నావు, బుద్ధుందా నీకసలు అని రేవంత్ కోపంగా కొంతా ఏమీచెయ్యలేనట్టు అసహనంగా కొంతా అన్నట్లుగా మాట్లాడుతూ శృతి ని నిలదీసాడు..


మరి నీ సంగతేమిటి రేవంత్ అని శాన్వి గొంతు వినిపించింది...రేవంత్ వెనక్కి తిరిగిచూస్తే శాన్వి అక్కడ నుంచుని ఉంది...ప్రియ కూడా ఇదే కదా నీకు అర్ధమయ్యేలా నచ్చచెప్పింది...కానీ నువ్వేమో ఈ శృతి లానే మూర్ఖంగా ప్రియ కోసం ఒకవేళ తను నిన్ను చేసుకోకుండా వేరే పెళ్ళి చేసుకుంటే ఆసిడ్ పొయ్యాలని, కత్తితో నరికెయ్యాలని అన్నీ సిద్ధం చేసుకున్నావు...


ప్రేమంటే ఆనందం ఇవ్వటం, ప్రేమంటే ఒక తోడై నిలవటం.... అంతే కానీ ప్రేమని ఒప్పుకోకపోతే, తిరిగి ప్రేమని అందించకపోతే,... నాకు దక్కని మనిషి ఇంక భూమి మీదే లేకుండా చెయ్యాలనుకోవటమా ప్రేమా...అలాంటి శాడిజం ప్రేమ కాదు...

ఆ మనిషి నా సొంతం మాత్రమే , అని భావించే నీ ఇరుకు మనస్తత్వం ప్రేమ కానే కాదు...మన ప్రేమ మనం ప్రేమించే వారిని భయపెడితే అది ప్రేమ కానే కాదు....ప్రేమ అనేది ప్రశాంతతకు రూపంలా మారాలే కానీ నాశనానికి దారి తియ్యకూడదు...


ప్రియ నీ మూర్ఖత్వానికి బలి అవ్వబోయేది, ఇప్పటికే శృతి ఆగడానికి కాలు ఫ్రాక్చర్ అయ్యి బాధపడుతోంది...ఇంత కుంచిత మనస్సులకు ప్రేమ అంటే సరైన అర్ధం తెలుసా....ప్రియని నువ్వు తనని ప్రేమించావన్న కారణంతో నిన్ను ప్రేమించాలి అనేది నియమం అనుకుంటే నిన్ను ప్రేమించిన శృతి ని మరి నువ్వూ ప్రేమిస్తావా...చెప్పు రేవంత్ అని శాన్వి అడిగింది...


యెస్ కరెక్టుగా అడిగావు శాన్వి...నాకు నువ్వు చేసే సాయం ఎప్పటికీ మర్చిపోను అని శృతి శాన్వి కి షేక్ హాండ్ ఇవ్వబోయింది...


రేవంత్ శృతితో చెప్పాడు.... 

శాన్వి చెప్పిందని ఈ రోజు నిన్ను ప్రేమించాను 

అని ఓ మాట మాత్రమే చెప్పగలను...

కానీ నిజంగా నా మనసులో నీ మీద ప్రేమభావన లేదు...ప్రేమ మూడోమనిషి ప్రమేయంతో పుట్టేది కాదు...అది ఇద్దరి మనుషులు నిర్ణయించుకునేది, అనుభూతి చెందాల్సింది...సారీ ఇప్పటికైతే ఈ ప్రేమ దోమ అనే విషయాన్ని నేను వదిలేసి ముందు నా కెరీర్ మీద ధ్యాస పెడతాను....నువ్వింక నన్ను విసిగించకు, నాకు నిజంగా జీవితభాగస్వామి కావాలి అనిపించిన రోజు అప్పటికి ఇంకా నా మీద నీకు ఇంతే ప్రేమ ఉంటే అప్పుడు నీగురించి తప్పకుండా ఆలోచిస్తాను...ఇప్పటికైతే నేను ఈ చిరాకులకి దూరంగా వెళ్ళిపోతున్నాను అని శృతికి చెప్పి.. 


శాన్వి వైపు చూసి కొంచెం కచ్చగానే చెప్పాడు రేవంత్...అప్పుడప్పుడే వివేకం తెచ్చుకోవాలి అనుకుంటున్నాడే కానీ ఇంకా వివేకం రాలేదుగా రేవంత్ కి....అందుకే రేవంత్ కచ్చగానే చెప్పాడు శాన్వీకి....... ఇంక జీవితంలో మీ ఫ్రెండ్ ప్రియకు నాకు ఏ సంబంధమూ లేదు, నేను తనకి హాని కలిగించేలా ఏ పనీ చెయ్యను...నువ్వు నీ ఫ్రెండ్ ప్రియ ని హాపీగా ఉండేలా చూసుకో అనేసి వెళ్ళిపోయాడు రేవంత్...


ఇన్ని రోజులూ ప్రియ కోసం, రేవంత్ కోసం దిగులు పడుతూ వారిద్దరినీ గమనించుకుని ఉంటూ రేవంత్ తప్పటడుగు వెయ్యకుండా, ప్రియ జీవితం పాడవకుండా, ముగిసిపోకుండా కాపాడుకుంది...శాన్వి , ఒక మంచి స్నేహితురాలు...



Rate this content
Log in

More telugu story from Thulasi Prakash

Similar telugu story from Drama