Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Triveni K

Children Stories

3.3  

Triveni K

Children Stories

క్షమించండి మాస్టారు

క్షమించండి మాస్టారు

4 mins
394


అది మా పదోతరగతి మొదలైన తొలిరోజులు.అల్లరి అల్లరిగా వానరమూకలా ఉండే తరగతి గదిలోకి అప్పుడే కొత్తగా జాయినయిన శ్రీనివాస్ మాస్టారు వచ్చారు. ఉద్యోగంలో మొదటి పోస్టింగ్ మా స్కూల్ లోనేనంట.మాస్టారి ఇన్షర్ట్, డ్రస్ సెన్స్ చూసి తెరిచిన నోరు మూయడం మర్చిపోయిన జలజ "అబ్బ, భలే ఉన్నారు కదే మాస్టారు. అచ్చు హీరోలా" అంటుంటే , అబ్బాయిలైతే పెద్దయ్యాక అచ్చు మాస్టారి లా ఉండాలంటూ ఊహ చిత్రాలు గీసేసుకుంటున్నారు.


మాస్టారు మాకు తెలుగు చెప్తారంట.అప్పటి వరకు మాకు తెలుగంటే బోర్. కాని మాస్టారు చెప్పే పాఠంలో కంఠశోష వచ్చేలా చదవడాలు లేవు.చెప్పిన ప్రశ్నకు సమాధానం వింటూనే నేర్చుకోవాల్సిందే.తెలుగు పాఠం మొదలుపెడితే అందులోకి అన్ని సబ్జెక్టులు అలవోకగా వచ్చిచేరేవి.ప్రపంచంలోని వింతలు, విశేషాలు మా పాఠంలో భాగమయ్యేవి. లెక్కలకి అత్యంత సులువుగా చేసే చిట్కాలు చెప్తుంటే ఇంత సులభమా అనిపించేది.అన్ని సబ్జెక్ట్లు వచ్చినప్పుడు తెలుగు టీచర్ ఎందుకయ్యారంటే నాకు అందరూ ఇష్టమే.కాని అమ్మ అంటే ప్రాణం. అలాగే అన్ని సబ్జెక్ట్స్ ఇష్టమే కానీ తెలుగు అంటే ప్రత్యేకమైన అభిమానం.టీచర్ అవ్వాలని అనుకున్నప్పుడు తెలుగే నన్ను ఆకర్షించింది.అంతేకాదు టీచర్ అవ్వాలంటే సహనం కావాలి.నాకు అమ్మలోనే అంత సహనం కనిపించింది.అందుకే మాతృభాషలోనే అది సాధ్యం అనిపించింది అనగానే తరగతంతా చప్పట్లు తో మార్మోగింది.


అలా మాస్టారి క్లాసంతా పాటలతో,ఆటలతో,,జరిగేది.మాస్టారు స్నేహితుడిగా మారిపోయారు.మా అభిరుచులు తెలుసుకొనీ ప్రోత్సహించేవారు.మాస్టారి ప్రోత్సాహంతో మేము కూడా చిన్న చిన్న కధలు, కవితలు రాయడం మొదలు పెట్టాం.


ఇలా ఉండగా మాకు లెక్కలు చెప్పడానికి క్రొత్త టీచర్ రాకపోవడంతో మా వ్యాయామ టీచర్ నరసింహం గారికి ఆ భాధ్యతలు అప్పగించారు. అప్పుడు మొదలయింది మాకు నరకం.క్లాసు క్లాసంతా ఆయన రాకతోనే లైబ్రరీలా మారిపోయేది.ఆయన పాఠం చెప్తే సందేహాలు అడగడానికి కూడా నోరు పెగలనంత నిశ్శబ్దం. "ఏరా ఆ కుర్ర మాస్టారు చెపితేనే అర్థం అవుతుందా. నేను చెప్తే అర్ధం కాదా" అంటూ అడిగిన వాళ్ళ చెంప చెళ్లుమనిపించిన సందర్భాలు బోలెడు.


ఆ రోజు శ్రీను మాస్టారికి పాప పుట్టిందంటూ ఆ సంతోషాన్ని మాతో పంచుకున్నారు. మా శుభాకాంక్షలు మధ్య అరుపులతో ఆ పీరియడ్ గడచి లెక్కల పీరియడ్ బెల్ కొట్టిన సంగతి మేము గమనించనే లేదు..


ఎప్పుడు వచ్చారో తెలియదు లెక్కల టీచర్ నరసింహం గారు గుమ్మం దగ్గరే నిలబడి మమ్మల్ని గమనిస్తున్నారు.

ఆయనని చూడగానే శ్రీను మాస్టర్" సార్,క్షమించండి. గమనించలేదంటూ అక్కడనుండి లేచి బయటకు వెళ్ళిపోయారు."

నరసింహం గారు లోపలికి వచ్చేలోపు భయంతో స‍ర్దుకొని కూచున్నాం.


ఆయన వస్తూనే గంభీరంగా ఉండే ఆయన మొహాం ఇంకాస్త కోపంతో మరింత భయం కరంగా ఉంది. అందర్నీ కలియ చూస్తూ అబ్బాయిలకు అమ్మాయిలకు మధ్య తిరుగుతూ ఆకుర్ర మాస్టారు అంత నచ్చేసాడా,,ఆడి మీద పడిపోతున్నారు. ఏ మేము పాఠాలు చెప్పట్లేదా.ఆడు క్లాసు లో ఉన్నంతసేపు నవ్వులు, ఇక ఇకలు,పకపకలు.మాస్టారిని చూడాగానే  ఎక్కడ లేని సోకులు. అంటూ తనలోని వికృతాన్ని కక్కేస్తూ బెంచి చివర ఉన్న లక్ష్మీ జడ పట్టి లాగడంతో అదాటున కింద పడిపోయింది. తన కళ్ళలో దూకేందుకు సిద్దమయిన కృష్ణ, గోదావరి నదులు మాస్టారి భయానికిి ఆనకట్టపడ్డాయి. దుఖఃతో అందరం లక్ష్మీ వైపు చూస్తుండగా వెళుతూ వెళుతూ కిరణ్ గాడి వీపుపై తన హస్త బలాన్ని చూపించారు తన చేతి కి అనుకూలంగా ఉండడంతో. చల్ మన్న శబ్ధంతో మార్మోగిన క్లాస్ రూం కిరణ్ గాడు మెలికలు తిరిగి ఎడుస్తుంటే మాస్టారి గదమాయింపుతో నిశ్శబ్దంగా మారిపోయింది.మళ్ళీ ఇంకోసారి ఇలాంటి వేషాలు వేస్తుండగా చూసానో చంపేస్తానంటూ ఏదో చెప్పాననిపించి క్లాసులో నుండి ఆయన బయటకు వెళ్ళగానే లక్ష్మిని ఓదార్చలేక కొందరం,కిరణ్ గాడి వీపుపై పడ్డ మాస్టారి ఎర్రటి చేతి గుర్తు చూసి కొందరం తన్నుకొస్తున్న దుఃఖాన్ని ఆపలేకపోతుంటే కొందరు మాత్రంరేపటి కార్యాచరణకు ఆలోచిస్తూన్నారు.


మరుసటి రోజు ఆరేడుగురం కలిసి క్లాసులు ఎగ్గొట్టి ఆ స్కూలుకు రెండు వీధుల అవతల.ఉండే అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఇంటి ముందు నిల్చున్నాం.ఎలాగైనా ఆయనతో మాట్లాడి లెక్కల మాస్టారికి వార్నింగ్ ఇప్పించాలనేది ఆలోచన.ఎంత సేపైనా మమ్మలని లోపలికి పంపక పోగా అక్కడే ఎండలో నిల్చోపెట్టెసారు.అడగగా అడగగా అక్కడున్న వాచ్ మన్ "సార్ ఇంట్లో లేరని, కలవాలంటే వారం తరువాత రమ్మని చెప్పడంతో "నిరాశగా వెనుదిరుగుతున్న వాళ్ళ ని అక్కడే ఉండి గమనిస్తున్న ఒక వ్యక్తి వచ్చి కలిసాడు. ఎందుకు వచ్చారని ప్రశ్నించాడు. చెప్పడానికి తటపటాయిన్న వాళ్ళను చెప్తే ఎమ్మెల్యే గారిని కలిసే అవకాశం కల్పిస్తామని అనడంతో విషయం మొత్తం చెప్పెసాం. అయితే ఇప్పుడు సార్ లేరని కుదిరిన ప్పుడు నేనే సార్కి మొత్తం విషయం చెప్పి సాయం చేస్తాననడంతో అందరం ఆనందంగా వెనుదిరిగాం.


మరుసటి రోజు ఉదయం క్లాసులు మొదలు కాకపోగా ప్రిన్సిపాల్ రూం నుండి అరుపులు, కేకలు.ఏమయిందో తెలీక వంగి వంగి చూస్తున్నాం.ఇంతలో శ్రీను మాస్టారు చేతిలో పేపర్ తో కోపంగా మా తరగతికి వచ్చారు.ఎప్పుడూ శ్రీను మాస్టారిని అంత కోపంగా చూడని మేము భయపడ్డాం.ఏమిటి ఇదంతా అంటూ పేపర్ నేలమీదకి విసిరికొట్టారు.ఆ పేపర్ తీసి అందులో పెన్ను తో మా‍ర్క్ చేసిన వార్త చూడగానే మా పైప్రాణాలు పైనే పోయాయి.అందులోని వార్త సారాంశం "స్కూల్ టీచర్ నరసింహం విద్యార్దినుల పట్ల అసభ్య ప్రవర్తన. తమ గోడు చెప్పుకొనేందుకు రాగా అందుబాటులోలేని ఎమ్మెల్యే.ట్రాన్సఫార్ చెయ్యాలని విద్యార్దుల వినతి"అని ఉంది.బహుశా నిన్న మనతో మాట్లాడింది పత్రికా విలేకరి అయ్యుంటాడు.మనతో విషయం రాబట్టి తనకి నచ్చినట్లు రాసేశాడు.ఏమి జరిగినా అందరం కలిసే ఉండాలనే నిర్ణయానికి వచ్చేశాం.ఇంతలో"నేనే చేయించానని అంటున్నారు.నాకు ఏమి అవసరం అని కూడా ఆలోచించడం లేదు ఎవరూ.మీతో చనువుగా స్నేహితుడిలా ఉండడం నా తప్పనుకుంటా..అందుకే మీరు చేసిన తప్పుకి నేను రాజీనామా చేసి ఉద్యోగం వదిలేసి వెళ్తాను.అంటూ కళ్ళ నీళ్ళతోబయటకు వెళ్తున్న మాస్టారికి అడ్డంగా నిల్చుని "తప్పు చేసింది ఆ మాస్టారు.మీరెందుకు ఉద్యోగం వదిలేయాలి" "ఆయన తప్పు చేస్తే మీరు ప్రిన్సిపాల్కి కంప్లైంట్ చెయ్యాలి.కానీ మీరేం చేసారు.ఎమ్మెల్యే వరకు ఎందుకు తీసుకువెళ్ళారు.ఇప్పుడు ఆయనని సస్పెండ్ చేసారు.ఏదో చిన్న స్కూలుకు ట్రాన్స్ఫార్ చేసేస్తారు.దానికి కారణం ఎవరూ.ఏమ నలో కూడా అర్దం కావట్లేదు."అంటున్న మాస్టారి తో"ప్లీజ్ మాస్టారు.తప్పు మాది. క్షమాపణ మేము అడుగుతాం అంటూ ఆఫీస్ రూం ముంద చేరాం అందరం.


నరసింహం మాస్టారు కోపంగా అరుస్తూ బయటకు వచ్చారు. ఆయన కాళ్ళపై పడ్డాం మూకుమ్మడిగా. మాస్టరు మమ్మల్ని క్షమించండి. మేము చేసిన తప్పు కి మమ్మల్ని క్షమించండి. కావాలని చేసింది కాదు.ఏదో అనుకుంటే ఏదో జరిగింది. అని చెప్తున్న మమ్మల్ని విదిలించేసారు.పురుగులను చూసినట్టు చూస్తూ" కావాలనే చేసారు మీరు మీ మాస్టారు.ఇన్నాళ్లుగా ఉన్న నా మర్యాదని, పరువును వార్తల్లోకి ఎక్కించారు.చెయ్యని తప్పును చేసానని నా గౌరవం మంట కలిసేలా చేసారు. మిమ్మల్ని మీ మాస్టారిని వదలిపెట్టను.మీ అంతు చూస్తానంటూ'" అక్కడి నుండి వెళ్ళిపోతుంటే శ్రీను మాస్టారు ఆపడానికి ప్రయత్నిస్తూ" వాళ్ళు కావలని చేసింది కాదు సర్.ప్లీజ్ సర్ "అంటున్న పట్టించుకోకుండా వెళ్ళిపోయారు.మిగతా టీచర్లు శ్రీను సర్ నే తప్పు పట్టారు.


మాస్టారిలో ఇంతకు ముందున్న ఉత్సాహం లేదు.పదోతరగత కనుక పాఠం చెప్పడం తప్ప మాతో మాట్లాడటం తగ్గించేసారు.అలా ఆ సంవత్సరం గడిచిపోయి మా పరీక్షలు అయిపోయాయి.


ఇంతగొడవకి కారణమైన మేము కొంత మంది కాలేజీలో జాయిన్ కాగా మిగతావాళ్ళంతా చెట్టుకు ఒకరు పుట్టకొకరుగా విడిపోయాం.

నరసింహం మాస్టారేమో పరిచయాల వల్ల తిరిగి మా ఊరిలోని వేరొక హైస్కూల్ కి మారిపోయారు.కానీ ఈ గొడవకి ఏ సంబంధంలేని శ్రీను మాస్టారు మాత్రం ఎవ్వరితోనూ ఎక్కువగా మాట్లాడటంలేదని,వాళ్ళ ఊరి కి ట్రాన్స్ఫార్ కోసం ప్రయత్నిస్తున్నారని తెలిసి భాధపడ్డం.కలిసేందుకు వెళితే పొడిపొడిగా మాట్లాడి పంపించేసేవారు.


అలా వెళ్ళినపుడు తోటి టీచర్ల మాటలతో మాస్టారిని భాధపెడుతన్నారని తెలిసి ఆయనని కలవడానికి వెళ్ళడం మానేసాం.తరువాత సంవత్సరానికి ఆయన బదిలీ అయ్యి వెళ్ళపోయారని సంతోషించాం.కనీసం ఎవరితోనూ మాటలు పడకుండా ఉంటారని.మాస్టారు ఎక్కడ ఉన్నా మరింత మంది విద్యార్థులను మంచి పౌరులుగా తీర్చిదిద్దుతారని.

ఆయనని మళ్ళీ కలవలేకపోయాం.

మళ్ళీ ఆయనని కలిస్తే మేమందరం చెప్పాలనుకొనే మాట "మమ్మల్ని క్షమించండి మాస్టారు............"


టీచర్లును కించపరిచే ఉద్దేశ్యం నాకు లేదు. కొన్ని చూసిన సంఘటనలకు కొన్ని కల్పతాలను చేర్చి ఈ కధ రాసాను.ఎవ్వరినైనా నొప్పిస్తే క్షమించగలరు.



Rate this content
Log in